close
Choose your channels

సీక్రెట్‌ నిశ్చితార్థంపై రెజీనా క్లారిటీ ఇచ్చేసింది!

Friday, June 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీక్రెట్‌ నిశ్చితార్థంపై రెజీనా క్లారిటీ ఇచ్చేసింది!

గత కొన్ని రోజులుగా హీరోయిన్ రెజీనాకు రహస్యంగా ఎంగేజ్మెంట్ అయిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే కొందరు అతి తెలివిపరులు రెజీనా, మరో వ్యక్తి ఫొటోను మార్ఫింగ్ చేసి.. ఇదిగో ఈయనే రెజీనాకు కాబోయే భర్త అని కూడా పుకార్లు పుట్టించి.. కథనాలు అల్లేశారు. అయితే రెజీనా నటించిన సినిమాలు వ‌ర‌సగా ఫ్లాప్‌లవ్వడం.. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక రెజీనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని మరో కోణంలో ఆలోచించిన వారూ ఉన్నారు.

అంతేకాదు.. రెజీనా ఈ వ్యవహారాలపై రియాక్ట్ కాకపోవడంతో ఇవన్నీ నిజమేనని అందరూ నమ్మేశారు. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చిన రెజీనా క్లారిటీ ఇచ్చేసింది. ఓ ప్రముఖ చానెల్‌తో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. వారం రోజులుగా తన పెళ్లి గురించిన వార్తలు షికారు చేస్తున్నాయని.. ఇవి అంతకంతకూ ఎక్కువవుతుండటం ఆందోళనతో మీడియా ముందుకు వచ్చానన్నది. తనకు నిశ్చితార్థం అయ్యిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అవన్నీ ఒట్టిపుకార్లే.. ఆ వార్తలను ఎవరూ నమ్మొద్దని రెజీనా చెప్పుకొచ్చింది. తనకు నిశ్చితార్థం జరగలేదని.. పెళ్లి తేదీ ఫిక్స్ కాలేదని పుకార్లకు ఈ భామ ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

అంతటితో ఆగని ఆమె.. ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో.. ఎందుకు పుట్టిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అయితే.. నిజంగానే తనకు పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని తానే స్వయంగా మీడియాకు, అభిమానులకు తెలియజేస్తానని.. దయచేసి ఇలాంటి పుకార్లు ఎవరూ రాయొద్దు.. వాటిని ఎవరూ నమ్మొద్దని రెజీనా చెప్పుకొచ్చింది. సో.. ఇకనైనా రెజీనాపై పుకార్లు ఆగుతాయో లేదో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.