close
Choose your channels

చైతు ప్రేమ‌మ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Thursday, January 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగ చైత‌న్య హీరోగా కార్తీకేయ ఫేం చందు మొండేటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైత‌న్య స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, శ్రుతి హాస‌న్ న‌టిస్తున్నారు. ఇటీవ‌ల వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో నాగ చైత‌న్య‌, శ్రుతి హాస‌న్ ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ప్రేమ‌మ్ సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి నాగార్జున టైటిల్ మ‌జ్ను అని పెట్టాల‌నుకున్న‌ప్ప‌ట‌కీ...ఫైన‌ల్ గా ప్రేమ‌మ్ నే ఫిక్స్ చేసార‌ని స‌మాచారం. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ప్రేమ‌మ్ సినిమాని జులై 7న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.