close
Choose your channels

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ.. కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

Tuesday, November 7, 2023 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ.. కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరుకున్నాయి. పోలింగ్‌కు మరో 22 రోజులు మాత్రమే ఉంది. దీంతో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలుకావడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ 16 మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ స్థానాలను ఇంకా పెండింగ్‌లో ఉంచగా.. బోథ్, వనపర్తి స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఇక ఈ జాబితాలో కామారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడ టఫ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రేవంత్.. కొడంగల్ నుంచి.. కేసీఆర్.. గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

16 మంది అభ్యర్థుల జాబితా ఇదే..

కామారెడ్డి - రేవంత్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్ - మహ్మద్ షబ్బీర్ అలీ
అశ్వారావు పేట (ఎస్టీ) - జారే ఆదినారాయణ
నారాయణఖేడ్ - సురేష్ కుమార్ షెట్కార్
చెన్నూరు (ఎస్సీ) - జి.వివేకానంద
బోథ్ (ఎస్టీ) - ఆదే గజేందర్
జుక్కల్ (ఎస్సీ) - తోట లక్ష్మీకాంతరావు
బాన్సువాడ - ఏనుగు రవీందర్ రెడ్డి
కరీంనగర్ - పురుమళ్ల శ్రీనివాస్
పటాన్ చెరు - నీలం మధు ముదిరాజ్
సిరిసిల్ల - కొండం కరుణ మహేందర్ రెడ్డి
వనపర్తి - తుడి మేఘారెడ్డి
డోర్నకల్ (ఎస్టీ) - డాక్టర్ జాతోథ్ రామచంద్రుడు నాయక్
ఇల్లందు (ఎస్టీ) - కోరం కనకయ్య
వైరా (ఎస్టీ) - మాలోత్ రామదాస్
సత్తుపల్లి (ఎస్సీ) - డాక్టర్ మట్టా రాగమయి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.