close
Choose your channels

మళ్లీ వాయిదా పడుతుందా...

Friday, August 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణా టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రుద్ర‌మదేవి`. ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ త్రీడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ గోన‌గ‌న్నారెడ్డిగా, రానా ద‌గ్గుబాటి చాళుక్య వీర‌భ‌ద్రుడి పాత్ర‌లో న‌టించారు.

ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించారు. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది. అయితే మధ్యలో బాహుబలి వంటి భారీ సినిమా రిలీజ్ వల్ల థియేటర్స్ సమస్య, చిన్న చిన్న టెక్నికల్ డెవలప్ మెంట్స్, ఆర్ధిక సమస్యలు అన్నీ కలిసి సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయడానికి దర్శక నిర్మాత గుణశేఖర్ ప్లాన్ చేశాడు. అయితే ఏమైందో ఏమో కానీ తాజాగా ఈ సినిమా సెప్టెంబర్ 11న కానీ లేదా 18న కానీ విడుదలయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. మరి దీనికి నిర్మాతలు ఏమంటారో మరి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.