రుద్రమదేవి మళ్లీ వాయిదాపడిందట..?
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
అందాల తార అనుష్క టైటిల్ రోల్ పోషించిన చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రాన్ని గుణ శేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా బాహుబలి కన్నా ముందు ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ..టైం కలసి రాక ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. చాలా సార్లు రిలీజ్ డేట్స్ మార్చిన గుణ శేఖర్ తాజాగా అక్టోబర్ 9న రుద్రమదేవి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించారు. ఇక రుద్రమదేవి రిలీజ్ డేట్ మారే ప్రసక్తే లేదు అన్నారు.
కానీ..మళ్లీ మామూలే. రుద్రమదేవి మళ్లీ వాయిదా పడింది. అక్టోబర్ 9న రిలీజ్ కావడం లేదట. నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ రిలీజ్ చేస్తారని సమాచారం.సినిమాని ఏ ముహుర్తంలో ప్రారంభించాడో కానీ...రుద్రమదేవి రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. భారీ బడ్జెట్ తో ఎంతో కష్టపడి గుణ శేఖర్ రుద్రమదేవి సినిమాని తెరకెక్కించాడు. తెర పై చూసుకుందాం అనుకుంటే కాలం కలసి రావడం లేదు. పాపం...గుణ శేఖర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.