close
Choose your channels

సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ ముఖ్య పాత్ర లో సహస్ర ఎంటటైన్మెంట్స్ సినిమా ప్రారంభం

Thursday, November 10, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రాన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్, సుద్దాల అశోక్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. నాగేంద్ర బుచ్చి రెడ్డిగారి నిరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది.

సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కాబోతున్నాయి. సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం నిర్మితమవుతుంది.

నటీనటులు: విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.