close
Choose your channels

కోలుకుంటున్న సీనియర్ నటి జయంతి

Thursday, July 9, 2020 • తెలుగు Comments

కోలుకుంటున్న సీనియర్ నటి జయంతి

సీనియర్ నటి జయంతి కాస్త కోలుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు కరోనా టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ అని ఫలితం వచ్చినట్టు వైద్యులు తెలిపారు. మంగళవారం జయంతి ఆరోగ్యం బాగా క్షీణించడంతో... ఆమెకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు. కొంతకాలంగా జయంతి ఆస్తమాతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం జయంతి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్టు వైద్యులు తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz