close
Choose your channels

నాలోని ద‌ర్శ‌కుడిని నాకు ప‌రిచ‌యం చేసింది క‌ళ్యాణ్ గారే - సిద్దార్ధ డైరెక్ట‌ర్ ద‌యానంద‌రెడ్డి

Thursday, September 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాగ‌ర్, రాగిణి, సాక్షి చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా ద‌యానంద‌రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మించారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన సిద్దార్ధ చిత్రాన్ని ఈనెల 16న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సిద్దార్ధ డైరెక్ట‌ర్ ద‌యానంద‌రెడ్డితో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

మీ గురించి చెప్పండి..?

1995లో మ‌ధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఏక్టింగ్ కోర్స్ లో డిప్లొమో చేసాను. అలాగే డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. ఈ ఇనిస్టిట్యూట్ లో సాగ‌ర్, ప్ర‌భాస్ శీను నాకు జూనియ‌ర్స్ గా ఉండేవారు. ఖుషి సినిమాకి మా బ్ర‌ద‌ర్ కొరియోగ్రాఫ‌ర్ శ్రీధ‌ర్ రెడ్డి వ‌ర్క్ చేసారు. ఆయ‌న ద్వారా క‌ళ్యాణ్ గారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఖుషిలో హైద‌రాబాద్ స్లాంగ్ లో డైలాగ్స్, అలాగే ఓ ఫైట్ ఉంటుంది. ఈ సీన్ కి డైలాగ్స్ మేమే రాసాం. ఈ సీన్ ని క‌ళ్యాణ్ గారికి వివ‌రిస్తుంటే నీలో రైట‌ర్ ఉన్న‌డంటూ న‌న్ను ఎంక‌రేజ్ చేసారు. డైరెక్ట‌ర్ గా జానీ సినిమా చేస్తున్నాను అని త‌న టీమ్ లో చేర‌మ‌ని ప్రొత్స‌హించారు. ఆ విధంగా నాలో ద‌ర్శ‌కుడిని నాకు ప‌రిచ‌యం చేసారు క‌ళ్యాణ్ గారు. ఖుషీ సినిమా ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి క్రియేటివ్ టీమ్ లో మెంబ‌ర్ గా వ‌ర్క్ చేసాను. పంజా సినిమా చేస్తున్న స‌మ‌యంలో నిర్మాత నీలిమ తిరుమ‌లశెట్టి గారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆత‌ర్వాత ఆమె నిర్మించిన అలియాస్ జాన‌కి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాను. స‌ర్ధార్ సినిమాకి మ‌ళ్లీ క‌ళ్యాణ్ గారి టీమ్ లో చేరాను. ఆ టైమ్ లో సాగ‌ర్ ఫోన్ చేసి సినిమా చేస్తున్నాం డైరెక్ట్ చేయాలి అని చెప్పాడు. క‌థ విన్నాను బాగుండ‌డంతో ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాను.

క‌థ విన్న‌ప్పుడు మీకు న‌చ్చిన పాయింట్ ఏమిటి..?

క‌థ సింపుల్ గా ఉన్నా...క‌థ‌నం మాత్రం డిఫ‌రెంట్ గా ఉంటుంది. సాగ‌ర్ బాడీలాంగ్వేజ్ కి స‌రిగ్గా స‌రిపోతుంది అనిపించింది. టి.వీ లో సాగ‌ర్ కి ఒక స్టార్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కి ఈ క‌థ యాప్ట్ గా ఉంటుంది. ఖ‌చ్చితంగా సాగ‌ర్ కి ఈ సినిమా మంచి పేరు తీసుకువ‌స్తుంది.

సిద్దార్ధ కాన్సెప్ట్ ఏమిటి..?

ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ తో ఉండే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. హీరో ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల కార‌ణంగా వీటికి దూరంగా విదేశాల్లో ఉంటాడు. అక్క‌డ ఒక అమ్మాయితో ప‌రిచ‌యం అవ్వ‌డం ప్రేమ‌గా మార‌డం జ‌రుగుతుంది. అయితే..ఈ అమ్మాయి వ‌ల‌న మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తే ఏం చేసాడ‌నేది కాన్సెప్ట్.

సీరియ‌ల్స్ లో న‌టించిన సాగ‌ర్ ను ఈ సినిమాకి అనుగుణంగా ఎలా మార్చారు..?

నేను మార్చాను అనేది క‌రెక్ట్ కాదు. బాడీలాంగ్వేజ్, డైలాగ్ డిక్ష‌న్, ఫైట్స్, సాంగ్స్...ఇలా సినిమాకి ఏం కావాలి... త‌ను ఏం చేయాలి అనే విష‌యం గురించి బాగా ఆలోచించి త‌న‌నితానే మార్చుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సాగ‌ర్ ఖ‌చ్చితంగా పెద్ద హీరో అవుతాడు.

హీరోయిన్స్ రాగిని, సాక్షి చౌద‌రి క్యారెక్ట‌ర్స్ ఎలా ఉంటాయి..?

రాగిణి స‌హ‌స్ర అనే క్యారెక్ట‌ర్ చేస్తే...సాక్షి చౌద‌రి అప్స‌ర అనే క్యారెక్ట‌ర్ చేసింది. ఈ రెండు క్యారెక్ట‌ర్స్ ప‌ర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్సే. ఇద్ద‌రికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకువ‌స్తుంది.

ఎస్.గోపాల్ రెడ్డి, మ‌ణిశ‌ర్మ‌, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్...ఇలా టాప్ టెక్నీషియ‌న్స్ తో వ‌ర్క్ చేసారు క‌దా..! మీకు ఏమ‌నిపించింది..?

గోపాల్ రెడ్డి గారు, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్, మ‌ణిశ‌ర్మ గారు....వీళ్లంద‌రూ ఈ సినిమాకి ఎస్సెట్. నేను కొత్త‌వాడిని అని కానీ, హీరో సాగ‌ర్ కొత్త‌వాడు అని కానీ...ఎలాంటి ఫీలింగ్ చూపించ‌కుండా మ‌మ్మ‌ల్ని బాగా చూసుకుంటూ మాకు వాళ్లు ఇచ్చిన రెస్పాక్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. వాళ్ల నుంచి ఎంతో నేర్చుకోవ‌డానికి నాకు ల‌భించిన మంచి అవ‌కాశంగా భావించాను.

ప‌వ‌న్ క్రియేటివ్ టీమ్ లో వ‌ర్క్ చేసారు క‌దా...! ఆ ప్ర‌భావం మీపై ఉంటుందా..?

ఖ‌చ్చితంగా ఉంటుంది. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు అస‌లు నాకు డైరెక్ష‌న్ అంటేనే ఏమాత్రం అవ‌గాహ‌న లేని నాకు నాలోని ద‌ర్శ‌కుడిని నాకు ప‌రిచ‌యం చేసారు క‌ళ్యాణ్ గారు. నేను ఇప్ప‌టి వ‌ర‌కు నేర్చుకుంది అంతా క‌ళ్యాణ్ గార్ని చూసే..! ఆయ‌న ప్ర‌భావం ఏదో రూపంలో నాపై ఉంటుంది.

ప‌వ‌న్ క్రియేటివ్ టీమ్ లో వ‌ర్క్ చేసారు క‌దా...మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని డైరెక్ట్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

నాకు క‌ళ్యాణ్ గార్ని డైరెక్ట్ చేయాలి అని ఉంది. క‌థ‌లు రాసుకుంటున్నాను. ఆయ‌న‌తో సినిమా అంటే ఏదో మామూలు సినిమా కాకుండా ఎక్స్ ట్రార్డిన‌రీ మూవీ చేయాలి అనేది నా ఆలోచ‌న‌. ఇంకో సినిమా చేసిన త‌ర్వాత అప్పుడు క‌ళ్యాణ్ గారితో సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?

ఓ యంగ్ హీరోతో మూవీ చేయ‌నున్నాను. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేస్తాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.