close
Choose your channels

'మనం' పరువు నిలబెట్టేలా 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా ఉంటుంది - నాగ్

Saturday, December 26, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కింగ్ నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య‌త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున న‌టిస్తున్న‌ చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. అనూప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగింది. ఆడియో సీడీల‌ను ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుద‌ల చేసి, తొలి సీడీని నాగార్జున‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా...

కింగ్ నాగార్జున మాట్లాడుతూ ``దేవుడు నాకు అన్నీ అడ‌క్కుండానే ఇచ్చాడు. వాటిలో అభిమానులు కూడా ఉన్నారు. అన్న‌పూర్ణ సంస్థ త‌ర‌పున మిమ్మ‌ల్ని క‌లిసి రెండు సంవ‌త్స‌రాలు అవుతుంది. మా బ్యాన‌ర్ లో మ‌నం సినిమాను చేశాం. ఆ సినిమాలో నాన్న‌, నేను అంద‌రం క‌ల‌సి న‌టించాం. మాకు దూర‌మైన నాన్న‌గారు మ‌నం సినిమాతో అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యారు. మ‌నం సినిమా త‌ర్వాత ఆ సినిమా పరువు నిల‌బెట్టేలా ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచించి చేసిన సినిమానే `సోగ్గాడే చిన్ని నాయ‌నా`. నాన్న‌గారు అనురాగం, అత్మీయ‌త‌, అనుబంధాలు, ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం ఇలాంటి సినిమాల‌నే చేసి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అలాంటి సినిమాకు హ‌లోబ్ర‌ద‌ర్ లాంటి ఎంట‌ర్‌ట్‌న్‌మెంట్‌ను యాడ్ చేస్తే ఎలా ఉంటుందోన‌ని ఆలోచ‌న‌తో ఈ సినిమా చేశాం. తెలుగువారికి ఇష్ట‌మైన పండుగ సంక్రాంతి. ప‌చ్చ‌ద‌నం, తియ్య‌ద‌నం అన్నీ క‌లిసి ఉంటాయి. అలాగే ఈ చిత్రంలో కూడా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్న‌పూర్ణ సంస్థ ఎప్పుడూ కొత్త‌వాళ్ల‌ని ఎంక‌రేజ్ చేస్తుంటుంది. మంచి క‌థతో నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తే నేను వారికి అండ‌గా ఉంటాను. క‌ళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. చాలా కొత్త డైలాగ్స్ నాతో చెప్పించాడు. ఉయ్యాల జంపాల రామ్మోహ‌న్ గారు ఇచ్చిన క‌థ‌ను డెవ‌ల‌ప్ చేసి ఈ సినిమా చేశాడు. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నాలుగు మచి సాంగ్స్ ఇచ్చాడు. సంక్రాంతికి వ‌స్తున్నాం...కొడుతున్నాం`` అన్నారు.

ఎ.నాగ‌సుశీల మాట్లాడుతూ ``త‌మ్ముడుకి సినిమాలో పంచెక‌ట్టుతో డ్యాన్స్ చేయాల‌ని చెబుతుండేదాన్ని ఇప్పుడు ఈ సినిమాలో త‌ను అలా డ్యాన్స్ చేశాడు. తమ్ముడు హ్యండ్ స‌మ్ గా క‌న‌ప‌డుతున్నాడు.యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

అమ‌ల మాట్లాడుతూ ``యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ ``నాగార్జున‌ను పంచెక‌ట్టులో చూస్తుంటే ద‌స‌రాబుల్లోడు చిత్రంలో నాగేశ్వ‌ర‌రావుగారిని చూస్తున్న‌ట్లుంది. ఆ సినిమా కంటే సోగ్గాడే చిన్ని నాయ‌నా డ‌బుల్ హిట్ కావాలి అన్నారు.

ర‌మ్య‌కృష్ణ మాట్లాడుతూ ``బంగార్రాజు, నా క్యారెక్ట‌ర్ అంద‌రికీ న‌చ్చుతాయి. సినిమాలో డైలాగ్స్ ఎంట‌ర్ టైనింగ్‌గా ఉంటాయి. క‌ళ్యాణ్ కృష్ణ ఫ్యూచ‌ర్‌లో పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడు. అంద‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు.

అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ ``మ‌నం సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. హ‌లోబ్ర‌ద‌ర్‌, నిన్నేపెళ్ళాడ‌తా చిత్రాల నిలిచిపోయే సినిమా అవుతుంది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. క‌ళ్యాణ్ కృష్ణ మంచి టాలెంటెడ్`` అన్నారు.

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ``టీజ‌ర్స్‌, సాంగ్స్ బావున్నాయి. నాన్న‌గారు 25 సంవ‌త్స‌రాల క్రితం ఉన్న ఎన‌ర్జీతో న‌టించారు. నాన్న పంచెక‌ట్టులో బావున్నారు. సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవుతుంది`` అన్నారు.

క‌ళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ `అక్కినేని నాగేశ్వ‌రరావుగారి వ‌ల్లే నేను ఈ రోజు ఇక్క‌డ నిల‌డి ఉన్నాను. దేవుడు నాకు నాగార్జున‌గారి రూపంలో క‌న‌ప‌డ్డారు. రామ్మోహ‌న్‌గారి స‌హా ఎంక‌రేజ్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు ``అన్నారు.

సుమంత్ మాట్లాడుతూ ``ట్రైల‌ర్ బావుంది. సినిమా పెద్ద హిట్ కావాలి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.

సుశాంత్ మాట్లాడుతూ ``సంక్రాంతికి చిన్న మావ‌య్య సినిమా వ‌చ్చి చాలా కాలం అవుతుంది. సంక్రాంతికి స‌రిప‌డే మూవీ వ‌స్తుంది. సినిమా సాంగ్స్‌, ట్రైల‌ర్స్ చూస్తుంటే హ‌లో బ్ర‌ద‌ర్ గుర్తుకు వ‌స్తుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంది`` అన్నారు.

అనూప్ మాట్లాడుతూ `ఇటీవల మా అమ్మగారు దూరమైయ్యారు. అప్పుడు అక్కినేని నాగార్జున అండ్ ఫ్యామిలీ అందించిన సపోర్ట్ మరచిపోలేం. అందరికీ థాంక్స్`` అన్నారు.

ఈ కార్యక్రమంలో లావణ్యత్రిపాఠి, హంసానందిని, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌ రచన: సత్యానంద్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.