close
Choose your channels

సునీల్ 'సైరా'

Sunday, September 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతోంది. అక్టోబ‌ర్ 6 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌నుంద‌నే విష‌యం తెలిసిందే. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కావ‌చ్చాయి. సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, న‌య‌న‌తార చిరంజీవితో జ‌త క‌డుతుంది.
ఈ సినిమాలో హీరో సునీల్ కూడా ఓ పాత్ర చేయ‌బోతున్నాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సునీల్ ఈ విష‌యాన్ని ధృవీక‌రించాడు. అయితే తాను చేయ‌బోయే పాత్రేంటో సునీల్ చెప్ప‌లేదు కానీ సైరా న‌రసింహారెడ్డి చేస్తున్నాన‌ని మాత్రం చెప్పాడు. నిజానికి ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంలో చిరంజీవితో న‌టించాల్సింది డేట్స్ ప్రాబ్ల‌మ్ రావ‌డంతో కుద‌ర‌లేదు. ఈ సినిమాలో న‌టిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని తెలియ‌జేశాడు సునీల్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.