close
Choose your channels

తాన్యా... హోప్ ఫ‌లించిన‌ట్టేగా

Monday, July 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తాన్యా... హోప్ ఫ‌లించిన‌ట్టేగా

కాస్త అందం, అభిన‌యం ఉన్న‌ హీరోయిన్లు ఓ మోస్త‌రు హీరోల ప‌క్కన న‌టించ‌డం ప‌రిపాటి. మ‌రో అడుగు ముందుకేసి ర‌వితేజ‌లాంటి వారి స‌ర‌స‌న న‌టించ‌డ‌మంటే... ప్ర‌మోష‌న్ వ‌చ్చిన‌ట్టేనా. అదే నిజ‌మైతే ఇప్పుడు తాన్యా హోప్‌కి కూడా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు`, `ప‌టేల్ స‌ర్‌`, `పేప‌ర్ బోయ్‌` వంటి సినిమాల్లో న‌టించిన తాన్యా హోప్‌కి తాజాగా ర‌వితేజ `డిస్కో రాజా`లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.

ఈ సినిమాకు వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడు. ఇందులో ఆమె సోలో హీరోయిన్ కాదు. ఇప్ప‌టికే పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్త‌న్నారు. పాయ‌ల్‌కు `ఆర్‌.ఎక్స్.100` హిట్ ఉంది. న‌భా కెరీర్‌లో తొలి చిత్రంతో పాటు ఇటీవ‌ల విడుద‌లైన `ఇస్మార్ట్ శంక‌ర్‌` కూడా హిట్టే. సో హిట్ ప‌రంప‌ర‌లో ఉన్న భామ‌ల మ‌ధ్య హిట్ కోసం వెయిట్ చేస్తున్న భామ‌ను కూడా ర‌వితేజ యాక్సెప్ట్ చేశార‌న్న‌మాట‌. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ప‌రిధి ఎంత అనేది మాత్రం ఆలోచించాల్సిన విష‌యం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.