close
Choose your channels

తెలంగాణ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌..

Friday, February 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌..

తెలంగాణలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ‘ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌’ను ప్రవేశపెట్టారు. 2019-20 ఏడాదికి గాను రూ.లక్షా 82,017 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. కాగా కేసీఆర్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌‌ రూ. 2లక్షల కోట్లు దాటలేదు.

బడ్జెట్‌‌లోని ముఖ్యంశాలు :-

వ్యవసాయ శాఖ:

వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు

నీటిపారుదల శాఖకు రూ. 22,500 కోట్లు

ఈఎన్టీ, దంత పరీక్షల కోసం రూ. 5,536 కోట్లు

రైతుబంధు, రుణమాఫీ కోసం:

రైతుబంధు కోసం రూ. 12 వేల కోట్లు

రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లు

రైతు బీమా కోసం రూ. 650 కోట్లు

2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న రూ. లక్ష వరకు పంట రుణాలు మాఫీ

బియ్యం రాయితీ కోసం రూ. 2,744 కోట్లు

ఎంబీసీ కార్పొరేషన్ కోసం రూ. వెయ్యి కోట్లు

షెడ్యూల్ కులాల ప్రగతి నిధి:

ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు

ఎస్సీల ప్రగతి కోసం రూ. 16,581 కోట్లు

మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2004 కోట్లు

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 1450 కోట్లు

నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు

ఆసరా పింఛన్ల కోసం రూ. 12,067 కోట్లు

బీసీల కోసం 119 గురుకులాల ఏర్పాటు

2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 10.4 శాతం

2017-18లో మొత్తం వ్యయం రూ. 1,43,133 కోట్లు

2017-18లో రెవెన్యూ మిగులు రూ. 3,459 కోట్లు

2018-19 సంవరించిన అంచనా వ్యయం రూ. 1,61,857 కోట్లు

2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు

మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు

రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు

ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా

వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,536కోట్లు

ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536కోట్లు

పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ.3,256కోట్లు

ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు

500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8లక్షల నిధులు

టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.1.41లక్షల కోట్ల పెట్టుబడులు

టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు

8.58లక్షల ఉద్యోగాలు వచ్చాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అంతేకాకుండా ప్రస్తుతమున్న రహదారులను మరమ్మతు చేయడంతో పాటు 340 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.