close
Choose your channels

రెండు తొలిప్రేమ‌లు.. రెండు కామ‌న్ పాయింట్స్‌

Tuesday, December 5, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జులై 24, 1998.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు. ఎందుకంటే.. ఆ రోజే ప‌వ‌న్ సినీ జీవితంలో ఓ అద్భుతం జ‌రిగింది. అదే తొలి ప్రేమ సినిమా విడుద‌లవ‌డం. యువ‌త‌నే కాకుండా కుటుంబ ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పించిన ఈ ఎవ‌ర్‌గ్రీన్ ల‌వ్‌స్టోరీ .. బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించడ‌మే కాకుండా ప‌వ‌న్ ని యూత్ ఐకాన్ చేసేసింది. తొలి ప్రేమ విడుద‌లై 20 ఏళ్ల‌వుతున్నా.. ఆ సినిమాని మ‌ర‌పించే ప్రేమ క‌థ రాలేద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం.

ప‌వ‌న్ కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్ లా నిలిచిన ఈ చిత్రం టైటిల్‌తో మ‌రో సినిమా రాబోతోంది. అయితే.. అది కూడా ఆ కుటుంబానికి చెందిన క‌థానాయ‌కుడిదే కావ‌డం విశేషం. ఫిదా త‌రువాత వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. అంటే.. 1998లో ప‌వ‌న్ తొలి ప్రేమ వ‌స్తే.. 2018లో వ‌రుణ్ తొలి ప్రేమ వ‌స్తోంద‌న్న‌మాట‌. ఈ రెండు చిత్రాల‌కి సంబంధించిన ఓ కామ‌న్ పాయింట్ ఏమిటంటే.. కొత్త ద‌ర్శ‌కులే వీటిని తెర‌కెక్కించ‌డం.

నాటి తొలి ప్రేమ‌ని క‌రుణాక‌ర‌న్ తాజ్‌మ‌హల్ అంత అందంగా తీర్చిదిద్దితే.. నేటి తొలిప్రేమ‌ని వెంకీ అట్లూరి రూపొందిస్తున్నాడు. మ‌రి ఆ మ్యాజిక్‌ని ఈ కొత్త ద‌ర్శ‌కుడు రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. అంతేకాకుండా.. నాటి తొలిప్రేమ‌ని పంపిణీ చేసిన దిల్ రాజు నేటి తొలి ప్రేమ‌ని కూడా డిస్ట్రిబ్యూష‌న్ చేస్తున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి.. రెండు తొలిప్రేమ‌ల్లోనూ కామ‌న్ పాయింట్స్ బాగానే ఉన్నాయ‌న్న‌మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.