close
Choose your channels

'పేట్ట'తెలుగు విడుద‌ల పై రెండు తేదీలు..

Wednesday, December 19, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పేట్టతెలుగు విడుద‌ల పై రెండు తేదీలు..

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

ర‌జ‌నీకాంత్‌తో పాటు న‌వాజుద్దీన్ సిద్ధికీ, విజ‌య్ సేతుప‌తి, త్రిష‌, సిమ్రాన్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ధారులు. అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న‌ విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సిద్ధం చేస్తున్నారనే సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాను తెలుగులో మాత్రం అనుకున్న‌ట్లు సంక్రాంతికి విడుద‌ల చేయ‌డం లేదని మీడియా వ‌ర్గాల స‌మాచారం. లెటెస్ట్‌గా జ‌న‌వ‌రి 25 లేదా ఫిబ్ర‌వ‌రి 1న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.