ఇష్టం లేకున్నా ఆయన కోసం ఎస్ చెప్పిన విద్యాబాలన్
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్' లో బసవతారకమ్మగా నటించిన విద్యాబాలన్. మరో దక్షిణాది సినిమాలో నటించనుంది. వివరాల్లోకెళ్తే బాలీవుడ్లో విజయవంతమైన 'పింక్' సినిమాను ఇప్పుడు తమిళ్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రను తమిళంలో అజిత్ పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో విద్యాబాలన్ నటిస్తుందనే వార్తలపై విద్యాబాలన్ రీసెంట్గా రిప్లై ఇచ్చారు. "పాత్ర చాలా చిన్నది. అది కాక నాకు రీమేక్ చిత్రాల్లో నటించడం ఆసక్తి లేదు. కానీ బోనీగారి కోసం చేస్తున్నాను. అతిథి పాత్ర ఉంది చేస్తావా? ఆయనే ఆఫర్ చేశారు.
ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా నటించడానికి అంగీకరించాను" అన్నారు విద్యాబాలన్. ఖాకి ఫేమ్ హెచ్.వినోద్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. ఫిబ్రవరి నుండి చిత్రీకరణ ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.