close
Choose your channels

తెలుగు మార్కెట్‌పై హీరో విజ‌య్ ఫోక‌స్‌..

Saturday, May 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు మార్కెట్‌పై హీరో విజ‌య్ ఫోక‌స్‌..

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మాస్ట‌ర్‌`. ఎక్స్‌బీ ఫిలిం క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గ్జేవియ‌ర్ బ్రిటో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఆండ్రియా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ చిత్రంలో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారని టాక్‌. విద్యార్థి, మాస్ట‌ర్ అనే రెండు పాత్ర‌ల్లో విజ‌య్ ఎలా ఆక‌ట్టుకుంటాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు అయితే ఆలోపు క‌రోనా ప్ర‌భావం స్టార్ట్ కావ‌డంతో సినిమా విడుద‌ల‌ను ఆపేశారు.

క‌రోనా ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌లేదు. థియేట‌ర్స్‌కు స‌డ‌లింపులు ఇప్ప‌ట్లో దొరికేలా క‌న‌ప‌డ‌టం లేదు. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. సినిమాను ఇంత ఆల‌స్యంగా వెన‌క్కి తీసుకెళ్ల‌డానికి కార‌ణం.. త‌మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో హీరో విజ‌య్ ఆలోచ‌న చేసి సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టించ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.