close
Choose your channels

పర్పస్ ఫుల్ & పవర్ ఫుల్ ఫిల్మ్ ఒక్కడొచ్చాడు - విశాల్

Monday, August 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాల్ న‌టిస్తున్న తాజా మాస్ ఫిల్మ్ ఒక్క‌డొచ్చాడు. ఈ చిత్రాన్ని సూర‌జ్ తెర‌కెక్కిస్తున్నారు. జి.హ‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు విశాల్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా విశాల్ ఒక్క‌డొచ్చాడు విశేషాల‌ను తెలియ‌చేస్తూ...పందెంకోడి, పొగ‌రు, భ‌ర‌ణి, పూజ, రాయుడు త‌ర్వాత చేస్తున్న మంచి సినిమా ఒక్క‌డొచ్చాడు. ప్ర‌పంచంలో ప్ర‌తి చోట అన్యాయానికి వ్య‌తిరేకంగా పోరాడే వ్య‌క్తి అవ‌స‌రం. ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌తిఘ‌టించి న్యాయం చేసేందుకు పొరాడే వ్య‌క్తి క‌ధే ఒక్క‌డొచ్చాడు. ఎంట‌ర్ టైన్మెంట్, రొమాన్స్, యాక్ష‌న్...ఇలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావ‌ల‌సిన అన్ని అంశాలు ఉండే ప‌ర్ప‌స్ ఫుల్ & ప‌వ‌ర్ ఫుల్ ఫిల్మ్ ఇది.
డైరెక్ట‌ర్ సూర‌జ్ ఈక‌థ చెప్ప‌గానే వెంట‌నే ఓకే చెప్పి ఈ సినిమా స్టార్ట్ చేసాను. అంత‌గా ఈ సినిమా క‌థ న‌చ్చింది. ప్ర‌తి ఒక్క‌రు ఈ క‌థ‌తో క‌నెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో నా క్యారెక్ట‌ర్ & క్యారెక్ట‌రైజేష‌న్ నా గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. హీరోయిన్ గా త‌మ‌న్నా న‌టిస్తుండ‌గా జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. త‌రుణ్ అరోర విల‌న్ గా న‌టిస్తున్నారు. నా పుట్టిన‌రోజును ఒక్క‌డొచ్చాడు సెట్ లో జ‌రుపుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని దీపావ‌ళికి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఖ‌చ్చితంగా నా కెరీర్ లో ఒక్క‌డొచ్చాడు సూప‌ర్ హిట్ ఫిల్మ్ గా నిలుస్తుంది. నా త‌దుప‌రి చిత్రాన్ని మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ లో రూపొందే ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న ప్రారంభించ‌నున్నాం అన్నారు.
నిర్మాత జి.హ‌రి మాట్లాడుతూ... విశాల్ కెరీర్ లో హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ ఫిల్మ్ ఇది. ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఉండే ప‌ర్ ఫెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ ఒక్క‌డొచ్చాడు. సెప్టెంబ‌ర్ 3 నుంచి ర‌ష్యాలోని అంద‌మైన ప్ర‌దేశాల్లో పాట‌ల‌ను చిత్రీక‌రించ‌నున్నాం. కోటిన్న‌ర ఖ‌ర్చుతో క‌ణ‌ల్ క‌న్న‌న్ నేతృత్వంలో చిత్రీక‌రించిన‌ ఓ ఛేజ్ సీన్, అలాగే శోభి నృత్య ద‌ర్శ‌క‌త్వంలో కోటి రూపాల ఖ‌ర్చుతో చిత్రీక‌రించే పాట ఈ చిత్రానికి హైలెట్స్ గా నిలుస్తాయి. త‌మ‌న్నా కోసం శృతిహాస‌న్ పాట పాడ‌డం మ‌రోక ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది అన్నారు.
విశాల్ , త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు, సంప‌త్ రాజ్, చ‌ర‌ణ్, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - హిప్ హాప్ త‌మిజ్, కెమెరా - రిచ‌ర్డ్ ఎం.నాథ‌న్, డైలాగ్స్ - రాజేష్ ఎ, మూర్తి, లిరిక్స్ - డా.చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి, ఎడిటింగ్ - ఆర్.కె. సెల్వ‌, కొరియోగ్ర‌ఫీ - ఫినిష్, శోభి, కో ప్రొడ్యూస‌ర్ - ఇ.కె ప్ర‌కాష్, ప్రొడ్యూస‌ర్ - జి.హ‌రి, స్టోరీ, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం - సూర‌జ్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.