close
Choose your channels

కపిల్ దేవ్ జీవిత చరిత్రలో ఎవరు?

Thursday, July 13, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండియాకు తొలిసారి వ‌ర‌ల్డ్ క‌ప్ తెచ్చి పెట్టిన స్టార్ క్రికెట‌ర్ క‌పిల్‌దేవ్. హ‌ర్యానాలో పుట్టిన ఈ ఆల్‌రౌండ‌ర్ 1983లో త‌న కెప్టెన్సీలో ప్ర‌పంచ‌క‌ప్ సాధ‌న‌లో కీల‌క‌పాత్ర పోషించాడు. ఈ క్రికెట్ వీరుడి జీవిత చరిత్ర‌ను సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తున్న త‌రుణంలో క‌పిల్ బ‌యోపిక్ అంద‌రిలో ఆస‌క్తిని రేపుతుంది.

కపిల్ క్రికెట్ హీరోగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో, ఫిక్సింగ్ నింద‌ను కూడా మోసి నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌చ్చాడు. మ‌రిప్పుడు క‌పిల్ బ‌యోపిక్‌లో ఇవ‌న్నీ చూపిస్తారా లేక కేవలం వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించిన తీరుని చూపిస్తారా అని తెలియ‌డం లేదు. క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌కుడిగా, అనురాగ్ క‌శ్య‌ప్ నిర్మాత‌గా సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో క‌పిల్ పాత్ర‌ధారిగా అర్జున్ క‌పూర్ న‌టిస్తాడ‌ని కొంద‌రంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తాడ‌ని అంటున్నారు. మ‌రి ఇద్ద‌రిలో క‌పిల్‌దేవ్‌గా క‌నిపించేదెవ‌రో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.