close
Choose your channels

తేజ్ స‌ర‌స‌న ముగ్గురిలో ఎవ‌రు?

Monday, June 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తేజ్ స‌ర‌స‌న ముగ్గురిలో ఎవ‌రు?

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొంద‌నున్న సంగతి తెలిసిందే. జి.ఎ2 పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేష‌న్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా తెర‌కెక్క‌నుంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌నే దానిపై ఇప్పుడు క‌స‌రత్తులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే `నేల‌టిక్కెట్టు` హీరోయిన్ మాళ‌వికా శ‌ర్మ పేరు విన‌ప‌డింది. కాగా ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ పేర్లు విన‌ప‌డుతున్నాయి. వారే నిధి అగ‌ర్వాల్‌, రుక్సార్ థిల్లాన్‌. మ‌రి ఈ ముగ్గురిలో హీరోయిన్ ఎవ‌ర‌నేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.