close
Choose your channels

'కాటమరాయుడు' తో యామినీ భాస్కర్

Tuesday, September 20, 2016 • తెలుగు Comments

తెలుగులో కీచక, టైటానిక్ చిత్రాలతో పాటు తమిళంలో మున్నోడి వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ యామినీ భాస్కర్ పుట్టిన‌రోజు ఈరోజు(సెప్టెంబ‌ర్ 20). త‌న వేడుక‌ను బంధు మిత్రుల‌తో కాకుండా పిల్ల‌ల‌తో జ‌రుపుకోవాల‌ని భావించిన యామినీ బాస్క‌ర్  సంగారెడ్డిలోని ఓగ‌ర్ల్స్ స్కూల్‌లో పిల్ల‌ల‌తో కలిసి త‌న పుట్టిరోజు వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. అక్క‌డి స్కూల్‌లో మెరుగైన నీటిని అందించ‌డానికి వాట‌ర్ ప్యూరిఫయ్య‌ర్‌ను కూడా అందించింది. త‌న‌కు ఈ ఏడాది ఇలా పిల్ల‌ల‌తో క‌లిసి పుట్టిన‌రోజు జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, అలాగే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `కాట‌మ‌రాయుడు` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం తన అదృష్టంగా భావిస్తున్నాన‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసింది యామినీ భాస్క‌ర్.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శృతిహాస‌న్ హీరో హీరోయిన్లుగా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా కాట‌మ‌రాయుడు సినిమా రూపొంద‌వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల నుండే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.