close
Choose your channels

డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'ఎలుకా మజాకా'

Monday, July 20, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

74 చిత్రాల అద్భుత హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో నా ఫ్రెండ్స్‌ ఆర్ట్‌ మూవీస్‌` అధినేతలు మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన రేలంగి సంపూర్ణ హాస్యభరిత 75వ చిత్రం ఎలుకా మజాకా`. స్టార్‌ కమెడియన్‌ డా.బ్రహ్మానందం ఇందులో ప్రధాన భూమిక పోషించగా వెన్నెల కిశోర్‌, పావని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం టాకీపార్ట్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్‌ వర్క్ ను జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు నరసింహారావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ రేలంగి నరసింహారావు గారు, దివాకరబాబు, గంగోత్రి విశ్వనాథ్‌ వంటి ముగ్గురు దిగ్గజాలు కలిసి మా ఎలుకా మజాకా` చిత్రాన్ని అద్భుతంగా తయారు చేశారు. ఇంత వరకు అందరూ హాయిగా నవ్వుకునే వినోదాత్మక చిత్రాలను రూపొందించిన రేలంగి గారు వాటికి భిన్నంగా గ్రాఫిక్స్ ను కూడా మిక్స్‌ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా డా.బ్రహ్మానందం గారు ఎలుకగా చేయటం, వారితో పాటు వెన్నెల కిషోర్‌, రఘుబాబు తదిదరులంతా మాకు ఎంతగానో సహకరించారని`` అన్నారు.

చిత్ర దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ఎలుకా మజాకా` చిత్రం షూటింగ్‌ మార్చితో పూర్తికాగా, డబ్బింగ్‌ కూడా పూర్తయింది. అంతేగాక ఇంటర్వెల్‌ వరకు గ్రాఫిక్‌ వర్క్‌ కూడా పూర్తయింది. ఈ నె 20 నుండి ఫైనల్‌ ఎడిటింగ్‌ ప్రారంభమవుతుంది. సీనియర్‌ రైటర్‌ దివాకరబాబుగారు ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చడమేగాక నాతో పాటు గ్రాఫిక్‌ వర్క్ లో పాల్గొంటూ తన సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సత్య గ్రాఫిక్‌ వర్క్‌ , గంగోత్రి విశ్వనాథ్‌ మాటు హైలెట్‌గా నిలుస్తాయి. సోషల్‌ మీడియాలో ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన భిస్తోంది. అభిరుచిగల నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. మార్చి 15కల్లా తొలి కాపీ రెడీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

ఈ చిత్రానికి మూల కథ: మురళీమోహనరావు, స్క్రీన్‌ప్లే: దివాకర్‌బాబు, మాటలు: గంగోత్రి విశ్వనాథ్‌, పాటలు: గంగోత్రి విశ్వనాథ్‌, తైదల బాపు, కెమెరా: నాగేంద్ర కుమార్‌, సంగీతం: బల్లేపల్లి మోహన్‌, గ్రాఫిక్స్‌: సగిలి సత్యనారాయణ రెడ్డి, కో- డైరక్టర్‌: రమణబాబు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ధవళ చిన్నారావు, నిర్మాతలు: మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు. కథ- దర్శకత్వం: రేలంగి నరసింహారావు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.