close
Choose your channels

కరోనా లిస్టులో కొత్తగా మరో మూడు లక్షణాలు

Sunday, June 28, 2020 • తెలుగు Comments

కరోనా కేసులతో పాటు లక్షణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా లక్షణాల లిస్టులో అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరో మూడు లక్షణాలను చేర్చింది. మొదట జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒంటి నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, అలసట, శ్వాస తీసుకోలేకపోవడం తదితర ఇబ్బందులను కరోనా లక్షణాలుగా వైద్యులు పేర్కొన్నారు. తరువాత ఆకలి మందగించడం, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలను కరోనా జాబితాలో చేర్చారు.

ప్రస్తుతం వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం వంటి లక్షణాలను కూడా కరోనా లిస్టులో అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేర్చింది. ఈ లక్షణాలన్నీ కరోనా సోకిన 2 నుంచి 14 రోజుల లోపు బయటపడతాయని అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. ఈ లక్షణాలు ఏవీ ఉన్నా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపింది.

Get Breaking News Alerts From IndiaGlitz