close
Choose your channels

Revanth Reddy: మనవడితో కలిసి హోలీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి

Monday, March 25, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Revanth Reddy: మనవడితో కలిసి హోలీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హోలీ సంబరాలే కనిపించాయి. స్నేహితులు, బంధువులపై రంగులు చల్లుకుంటూ తెగ ఎంజాయ్‌ చేశారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఉదయం నుంచే.. రంగులు పట్టుకుని ఒకరిపై ఒకరు చల్లుకుంటున్నారు. ఇక రాజకీయ నేతలు కూడా తామేమీ తక్కువ కాందంటూ హోలీ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా హైదరాబాద్‌లోని తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించారు. తాత ఒళ్లో కూర్చుని రేయాన్స్ చిరునవ్వులు చిందించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిజీ లైఫ్‌లో కాసేపు మనవడితో కలిసి సరదాగా సేద తీరుతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Revanth Reddy: మనవడితో కలిసి హోలీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి

మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కొల్లాపూర్‌లో బైక్‌పై తిరుగుతూ వ్యాపారస్తులకు, ప్రజలకు రంగులు పూస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. పారిశుధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలతో కలిసి పండుగ జరుపుకున్నారు. బండి సంజయ్‌ ఇంటి దగ్గరకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు చేరుకున్నారు. బైక్‌పై గల్లీ గల్లీ తిరుగుతూ కనిపించిన వారిందరికీ రంగులు పూసి ఉత్సాహంగా కనిపించారు. ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారులు, చిన్నపిల్లలతో కలిసి హోలీ ఆడారు.

Revanth Reddy: మనవడితో కలిసి హోలీ సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా హోలీ సంబరాల్లో పాల్గొని రంగులు చల్లుకుంఎటూ ఫుల్‌ ఎంజాయ్ చేశారు. వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే నాయిని రాజేంద్రనాధ్‌ కార్యకర్తలు, అభిమానులతో కలిసి పండుగ జరుపుకున్నారు. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగయ్య పల్లి తండాలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గిరిజనులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా హోలీ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.

అటు ఏపీలోనూ రాజకీయ నేతలు హోలీ వేడుకల్లో హల్‌చల్ చేశారు. ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో బైక్‌పై తిరుగుతూ ప్రజలకు రంగులు పూస్తూ హోలీ జరుపుకున్నార. అనంతరం మహిళలు, చిన్నారులతో కలిసి స్టెప్పులు వేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఈయనతో పాటు అనేక మంది నేతలు హోలీ వేడుకల్లో పాల్గొని సేద తీరారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.