close
Choose your channels

తెలంగాణలో నేడు 1891 కేసులు..

Sunday, August 2, 2020 • తెలుగు Comments

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం కరోనా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 19,202 శాంపిళ్లను పరీక్షించగా.. 1891 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మొత్తంగా ఇప్పటి వరకూ 66,677 కేసులు నమోదయ్యాయి. నేడు ఒక్కరోజే 1088 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 47,590 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 540కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,547 యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఇప్పటి వరకూ 4,77,795 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 1656 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz