close
Choose your channels

'దేవ‌దాస్' చిత్రీక‌ర‌ణ పూర్తి

Wednesday, September 12, 2018 • తెలుగు Comments

దేవ‌దాస్ చిత్రీక‌ర‌ణ పూర్తి

అక్కినేని నాగార్జున‌, నాని హీరోలుగా రూపొందుతున్న చిత్రం `దేవ‌దాస్‌`. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 27న సినిమా విడుద‌ల కానుంది. ప్యాచ్ వ‌ర్క్ స‌హా ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసుకుంది.

ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. సినిమా లాఫింగ్ రైట్‌గా ఎంట‌ర్‌టైన్ చేయ‌నుంది.

అకాంక్ష‌సింగ్‌.. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున మాఫియా డాన్‌గా.. నాని డాక్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.