close
Choose your channels

జగన్‌కు డిప్యూటీ సీఎంల సలహా ఇచ్చింది ఆయనేనా!?

Tuesday, June 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జగన్‌కు డిప్యూటీ సీఎంల సలహా ఇచ్చింది ఆయనేనా!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఆయన తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ ప్రపంచం ఏపీ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల రోజు సాయంత్రం నుంచి తొలి కేబినెట్ భేటీ వరకూ ఆయన చేస్తున్న సంచలన ప్రకటనలు, శుభవార్తలతో ప్రజలు, ఉద్యోగులు, రైతన్నలు, మహిళలు, అవ్వాతాతలు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇలా అన్ని వర్గాలకు జగన్ శుభవార్తలు చెప్పుకుంటూ పోతున్నారు.

జగన్‌కు సలహా ఇచ్చిందెవరు!?

అయితే.. ఇవన్నీ ఒక ఎత్తయితే దేశం కనీవినీ ఎరుగని.. ఇప్పటి వరకూ యావత్ భారత్‌లో లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను వైఎస్ జగన్ నియమించారు. జగన్ చేసిన ఈ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే వైఎస్‌ జగన్‌కు ఈ సలహా ఎవరిచ్చారు..? జగనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారా..? లేకుంటే ఇంకెవరైనా ఇలా చేయండి అని సలహాలు, సూచనలు ఇచ్చారా..? అనేదానిపై కూడా చర్చసాగుతోంది. ఈ వ్యవహారంపై కాస్త లోతుల్లోకి వెళ్లగా దీనివెనుక ఉన్నదెవరు..? సలహా ఇచ్చిందెవరన్న ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

కర్త, కర్మ, క్రియ.. రూపకర్త ఆయనే..!

వైసీపీలో కీలకనేత, 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరని అడిగితే టక్కున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అనే మాటే వస్తుంది. ఎందుకంటే పార్టీలో సీనియర్, అన్ని విషయాలపై అవగాహన ఉండటం, వయసులో పెద్ద కావడం ఇందుకు కారణం. అయితే ఈ డిప్యూటీ సీఎంల వ్యవహారం గురించి కూడా ఉమ్మారెడ్డే సలహా ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం ఉమ్మారెడ్డి-వైఎస్ జగన్‌- వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ముగ్గురూ కూర్చొని ఏదైనా కొత్త క్రియేటివిటీ ఉండాలి.. అది దేశంలో ఎక్కడా ఉండకూడదని జగన్ ఆ ఇద్దర్నీ అడగ్గా.. ఉమ్మారెడ్డి నోట్లోంచి మొదట.. ఐదుగురు సీఎంల వ్యవహారం గురించి చర్చ మొదలైందట. అనంతరం పీకే (ప్రశాంత్ కిషోర్) కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. సో.. డిప్యూటీ వ్యవహారానికి బీజం వేసింది.. కర్త, కర్మ, క్రియ ఉమ్మారెడ్డేనన్న మాట.

వాస్తవానికి ఉమ్మారెడ్డినే..!

సో.. ఏదేమైనా జగన్ తీసుకున్న నిర్ణయంతో యావత్ ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో. వాస్తవానికి డిప్యూటీ సీఎంగా ఉమ్మారెడ్డిని నియమించాలని జగన్ భావించారని అయితే సామాజిక వర్గ పరంగా లెక్కలేసినప్పుడు వర్కవుట్ అవ్వలేదని.. అయినప్పటికీ ఆయన విలువైన సలహాలు, సూచనలు ఎప్పుడూ తీసుకుని.. ఉమ్మారెడ్డికి తగిన ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారని సమాచారం. అయితే మున్ముంథు వైఎస్ జగన్.. కేబినెట్ మంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.