close
Choose your channels

చిరంజీవిని డైరెక్ట్ చేయాలనుకుంటున్న డైరెక్టర్!!

Friday, May 15, 2020 • తెలుగు Comments

చిరంజీవిని డైరెక్ట్ చేయాలనుకుంటున్న డైరెక్టర్!!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాల‌ను చేస్తూ పోతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న యువ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. అలాగే వారితోనే సినిమాలు చేస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆచార్య పూర్త‌యిన త‌ర్వాత సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టిస్తుంటే..మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ చిత్రం వేదాళంలోనూ న‌టించ‌బోతున్నారు. దీంతో యువ ద‌ర్శ‌కులంద‌రూ చిరంజీవితో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. అలాంటి యువ ద‌ర్శ‌కుల వ‌రుస‌లో డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కూడా చేరారు.

సంప‌త్ నంది ప్ర‌స్తుతం గోపీచంద్ హీరోగా రూపొందిన ‘సీటీమార్‌’ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చిరంజీవితో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట సంప‌త్ నంది. ఇప్ప‌టికే చిరంజీవి కోసం క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. ర‌జాకార్ల నేప‌థ్యంలో సాగే క‌థ‌నంతో ఈ ద‌ర్శ‌కుడు స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నాడ‌ట‌. మ‌రి చిరంజీవిని మెప్పిస్తాడో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగ‌క‌త‌ప్ప‌దు. గ‌తంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ సినిమాను డైరెక్ట్ చేసి మంచి మార్కుల‌నే కొట్టేశాడు సంప‌త్ నంది.

Get Breaking News Alerts From IndiaGlitz