close
Choose your channels

టీడీపీకి మరో ఎదురెబ్బ.. మాజీ ఎంపీ కన్నుమూత

Friday, September 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీకి మరో ఎదురెబ్బ.. మాజీ ఎంపీ కన్నుమూత

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2019 ఎన్నికల తర్వాత శివప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. అయితే పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ మెరుగుపడకపోవడం.. మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందతూ శివప్రసాద్ కన్నుమూశారు.

జననం!
కాగా.. శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి, 1951 జూలై 11న నాగయ్య, చెంగమ్మ దంపతులకు నాటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. ఇతడు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించాడు. నాడు చంద్రబాబుతో కలిసి ఈయన చదవుకున్నారు. సాహిత్యము, కళలు, సినిమా నటన ఈయనకు బాగా పిచ్చి. అలా ఒకట్రెండు కాదు కొన్ని పదుల సంఖ్యల సినిమాల్లో కూడా నటించారు. 2005లో విడుదలైన దొంగ సినిమాలో నటనకు గాను ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది.

సినిమాలంటే పిచ్చి!

ముఖ్యంగా..ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అనంతరం రాజకీయాలంటే మక్కువతో సినిమాల నుంచి బయట నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.2009,2014 టీడీపీ తరఫున ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఈయన వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా.. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

చంద్రబాబుకు ఆప్తుడు..!

శివప్రసాద్.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలా ఆప్తుడు. నిన్న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఆయన.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నిన్నట్నుంచి శివప్రసాద్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులను అడిగతి తెలుసుకున్న చంద్రబాబు.. ఇవాళ సాయంత్రం కుటుంబ సమేతంగా వెళ్లి చెన్నైలో పరామర్శించి రావాలని అనుకున్నారు. అయితే ఈ గ్యాప్‌లో శివప్రసాద్ ఇక లేరను అనే వార్త తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మరోవైపు మాజీ ఎంసీ స్వగ్రామంలో అనుచరులు, కార్యకర్తలు విషాదంలో మునిగి తేలుతున్నారు.

కాగా.. వారం వ్యవధిలోనే టీడీపీకి చెందిన ఇద్దరు ఉద్దంఢులు మాజీ స్పీకర్ కోడెల శిప్రసాద్ ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా సీనియర్ నేత శివప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవటం టీడీపీకి పెద్ద షాక్.. ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా టీడీపీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.