close
Choose your channels

50 కోట్ల క్ల‌బ్‌లో 'గీత గోవిందం'

Monday, August 20, 2018 • తెలుగు Comments

50 కోట్ల క్ల‌బ్‌లో గీత గోవిందం

ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన 'గీత గోవిందం' బాక్సాఫీస్ సంచ‌నాల‌కు కేంద్ర‌మైంది. అర్జున్‌రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం కావ‌డంతో.. తొలి రోజున యూత్ థియేట‌ర్స్‌కు వ‌చ్చారు. అయితే విజ‌య్‌దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా న‌టన‌.. ప‌రుశురామ్ టేకింగ్ అంద‌రికీ క‌నెక్ట్ అయింది. దీంతో క‌లెక్ష‌న్స్ భారీ చిత్రాల‌కు పోటీగా వ‌స్తుండ‌టం నిర్మాత‌ల‌కు ఆనంన‌దంతో పాటు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి.

విడుద‌లైన ఐదు రోజుల‌కు సినిమా 50.7 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను సాధించింది. 31.65 కోట్ల రూపాయ‌ల షేర్ కలెక్ష‌న్స్ వ‌చ్చాయి. శాటిలైట్ హ‌క్కులు.. రీమేక్ హ‌క్కులు అమ్ముడు కాకుండానే .. ఇంత మొత్తం రావ‌డం తెలుగు సినిమాను సత్తాను తెలియ‌జేస్తుంది.

అయితే మూడో సినిమాకు విజ‌య్‌దేవ‌ర‌కొండ 50 కోట్ల హీరోగా అవ‌త‌రించడం విశేషమైతే.. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌.. మ‌రో స్టార్ హీరోగా అవ‌త‌రించ‌డాని ఇత‌ర హీరోలు అత‌న్ని అప్రిషియేట్ చేస్తుండ‌టం విశేషం.