close
Choose your channels

పవన్ ఫ్యాన్స్‌‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీశ్

Tuesday, May 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్ ఫ్యాన్స్‌‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీశ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్‌’ మూవీని హరీశ్ శంకర్ తెరకెక్కించి సరిగ్గా ఎనిమిదేళ్లయ్యింది. ఈ సినిమాతో హరీశ్ రేంజ్ ఎక్కడికెళ్లిపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సుమారు పదేళ్లకు పైగా వరుస సినిమాలు ప్లాప్ అవ్వడంతో పవన్‌తో సినిమా తీయగా ఎవరూ ఊహించని రీతిలో సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాను ఇటు హరీశ్.. అటు పవన్.. మెగాభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు కూడా. ఎందుకంటే ఆ సినిమా రేంజ్ అలాంటిది మరి. కాగా సినిమా రిలీజై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్ ‘గబ్బర్‌సింగ్’ ట్యాగ్స్, పిక్చర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మే-11ను పవన్ వీరాభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రిపీట్ కాబోతోంది..

కాగా.. ‘వకీల్ సాబ్’, క్రిష్‌తో మూవీల అనంతరం హరీశ్‌తో పవన్ సినిమా ఉంటుందని ఇదివరకే అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ కాంబోలో వస్తున్న సినిమాపై మెగాభిమానులు, సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఇందుకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు హరీశ్. అదేమిటంటే.. ‘గబ్బర్ సింగ్’ బాణీలు అందించి తన మ్యూజిక్‌తో సినీ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసిన రాక్ స్టార్ దేవీ ప్రసాద్.. తాను చేయబోయే పవన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడని అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా హరీశ్ తెలిపాడు. అంటే పవన్-హరీశ్-రాక్ స్టార్ ఈ కాంబో మళ్లీ రిపీట్ కానుందన్న మాట.

కలిసి పనిచేయబోతున్నాం..!

‘ఇది అద్భుతమైన రోజు. 8 సంవత్సరాల క్రితం సినిమా విడుదల రోజు ఎంతో ఎనర్జీ వచ్చిందో ఇప్పుడూ అదే ఎనర్జీ వచ్చింది. ఆ సినిమాకున్న సంగీత శక్తిని మళ్లీ రీ క్రియేట్ చేయబోతున్నామని తెలియజేయడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదని అనుకుంటున్నా. పవన్ కల్యాణ్‌గారితో నేను చేయబోతున్న చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. మేము మళ్లీ కలిసి పనిచేయబోతున్నాం. ఇప్పుడే మొదలైంది’ అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు పలువురు అభిమానులు, సినీప్రియులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos