close
Choose your channels

‘పవన్‌.. నీ అసలు పేరేంటి.. ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేవ్!?’

Saturday, November 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘పవన్‌.. నీ అసలు పేరేంటి.. ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేవ్!?’

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేడని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై ఈ మధ్య పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్న విషయం విదితమే. ఇందుకు తాజాగా స్పందించిన నాని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ‘జగన్‌ను ఏమని పిలవాలని అడుగుతున్న పవన్‌ అసలు పేరేంటి..!?. మీ తండ్రి కళ్యాణ్‌ బాబు అని పేరు పెడితే.. సినిమాల్లోకి వచ్చాక పవన్‌ కళ్యాణ్‌ అని, నీ అభిమానులు పవన్‌ స్టార్‌ అని, నీ యాక్టింగ్‌, డ్రామా చూసి మా పార్టీ వాళ్లు పవన్‌ నాయుడు అని పేరు పెట్టారు. నీ దురాభిమానులు ప్యాకేజీ స్టార్‌ అని పెట్టారు. నీకు కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా..?. నీ పార్టీ తరఫున ఓడిపోయిన 174 మందిని పిలిచి నిన్ను ఏ పేరుతో పిలవాలో తేల్చుకో ..?. పవన్‌ ఎన్ని జన్మలెత్తినా ముఖ్యమంత్రివి కాలేవ్ కాదు కదా..? ప్రతిపక్ష నేతవు కూడా కాలేవు’ అని నాని వ్యాఖ్యానించారు.

పిచ్చి పిచ్చిగా మాట్లాడితే...!

‘చంద్రబాబు ఆయన పార్ట్‌నర్‌ పవన్‌ మతాలు, కులాల గురించి మాట్లాడుతున్నారు. పవన్‌ పుస్తకాలు చదివా అని గొప్పగా మాట్లాడుతున్నారు.. ఆయన విధి విధానాలు తెలుశా..!?. కులాల గురించి మాట్లాడే వ్యక్తి రాష్ట్రంలో పవన్‌ మాత్రమే. తిరుపతి వెళ్లి అక్కడి పూజలు చేసిన తరువాతే జగన్‌ పాదయాత్ర మొదలుపెట్టారు. అయిపోయిన తరువాత కూడా తిరుపతి వెళ్లాడని, మసిదు, చర్చీలకు వెళ్లారు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి పవన్‌ ప్రశ్నిస్తే జగన్‌ సమాధానం చెప్పాలా..?. జగన్‌ తిరుమలలో ఎందుకు సంతకం చేయలేదని ప్రశ్నించారు..? జగన్‌ ఆంధ్ర పౌరుడని, ఇక్కడ పుట్టిన వ్యక్తి.. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది.. సోనియా అంటే నీకు భయమేమో కానీ, జగన్‌ భయపడలేదు’ అని పవన్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.