close
Choose your channels

మెగాస్టార్ 153: మంచి కిక్కిచ్చే అప్డేట్.. మోత మోగడం ఖాయం

Monday, June 28, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ 153: మంచి కిక్కిచ్చే అప్డేట్.. మోత మోగడం ఖాయం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈలోపు చిరు 153వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫెర్ రీమేక్ లో చిరు నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి.

తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. దీనితో దర్శకుడు మోహన్ రాజా మరో అడుగు వేశారు. సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ తో కలసి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

మెగాస్టార్ 153: మంచి కిక్కిచ్చే అప్డేట్.. మోత మోగడం ఖాయం

'మెగాస్టార్ 153 పనులు మొదలయ్యాయి. మెగాస్టార్ పై అభిమానాన్ని వ్యక్తపరచాల్సిన టైం వచ్చింది. మంచి హై ఇచ్చే స్టఫ్ రెడీ అవుతోంది ' అని తమన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తమన్.. మోహన్ రాజాతో తీసుకున్న సెల్ఫీలని పోస్ట్ చేశాడు.

తమన్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. క్రాక్, వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని తమన్ ఈ ఏడాది తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా వకీల్ సాబ్ చిత్రానికి తమన్ అందించిన సంగీతం గురించి ఎంత వర్ణించినా తక్కువే. అద్భుతమైన పాటలు ఒకెత్తయితే.. థియేటర్లు మోతెక్కే బీజియంతో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు తమన్. మెగాస్టార్ 153 కి కూడా అదే తరహా సంగీతాన్ని అభిమానులు ఆశించడం ఖాయం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.