శ్రీరెడ్డి వ్యవహారం నోరు విప్పిన నాని భార్య...
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో హాల్ చల్ చేసిన శ్రీరెడ్డి.. నేచురల్ స్టార్ నాని తనను వాడుకుని వదిలేశాడని.. రీసెంట్గా తనను బిగ్బాస్ హౌస్లోకి ఎంటర్ కానీయకుండా అడ్డుకున్నాడని.. అతని రంకును బయట పెడతానని, తన కాపురంలో ఇక నిప్పులేనని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా నాని శ్రీరెడ్డికి లీగల్ నోటీసుల కూడా పంపాడు.
సహనానికి ఓ హద్దు ఉందంటూ.. ఈ సందర్భంగా నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాని శ్రీమతి అంజనా శ్రీరెడ్డి వ్యవహారంపై భర్త నానికి తన వంతు సహకారాన్ని అందించింది. "సినిమా పరిశ్రమలో దయా గుణం ఎక్కువ. అయితే కొందరు పబ్లిసిటీ కోసం ఇతరుల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు.
వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవరూ నమ్మరనుకోండి. వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగుజార్చుకోవడానికి ఎలా సిద్ధపడతారో" అంటూ ట్వీట్ చేయడం హాట్ టాప్ అయ్యింది. అలాగే మరోవైపు శ్రీరెడ్డి.. నాని లీగల్ నోటీసులు పంపడం మంచిదేనని, నాని గురించి బయట పెట్టే అవకాశం తనకు వచ్చిందంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.