close
Choose your channels

'నెపోలియన్' ట్రైలర్ విడుదల చేసిన హీరో సందీప్ కిషన్ , నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్

Wednesday, August 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆచార్య క్రియేషన్స్‌, ఆనంద్‌ రవి కాన్సెప్ట్‌ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం 'నెపోలియన్‌'. ఆనంద్‌ రవి దర్శకుడు. భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, హీరో సందీప్‌కిషన్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత బోగేంద్ర గుప్తాకు చెందిన ట్రిపుల్ ఎస్ అనే ఎన్‌.జి.ఒ సంస్థ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న జ‌ర్న‌లిస్ట్ వ‌రప్ర‌సాద్‌కు పాతిక‌వేల రూపాయ‌ల చెక్‌ను అంద‌జేశారు. ఈ చెక్‌ను సీనియ‌ర్ పాత్రికేయులు బి.ఎ.రాజు, ప‌సుపులేటి రామారావు అందుకున్నారు.

కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''2011-12 నుండి ఆనంద్‌ రవి నాకు పరిచయమే. తను చేసిన పేరెంట్స్‌ మూవీ చూసిన రోజే తప్పకుండా ఇతను మంచి దర్శకుడు అవుతాడని భావించాను. ప్రతినిధి సినిమా కూడా చాలా మంచి కథతో రన్‌ అవుతుంది. తను ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలియగానే తను ఎందుకు నటన పట్ల ఆసక్తి చూపుతున్నాడని అనుకున్నాను. అయితే ట్రైలర్‌, పోస్టర్స్‌ చూడగానే తనైతేనే కరెక్ట్‌గా యాప్ట్‌ అవుతాడనిపించింది. ఇక డబ్బుంటే చాలు సినిమాలు తీసేయవచ్చు అనురకునే నిర్మాతలున్న ఈరోజుల్లో గుప్తాగారు ప్రొడక్షన్‌ గురించి నేర్చుకుని సినిమా నిర్మాతగా మారారు. ఇక సినిమా గురించి చెప్పాలంటే టెక్నికల్‌గా మంచి సినిమా. నటీనటులు చక్కగా పెర్ఫామ్‌ చేసినట్లు కనపడుతుంది. ఆనంద్‌ రవి చాలా పరిణితితో సినిమా చేసినట్టు కనపడుతుంది. ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరిస్తారు'' అన్నారు.

సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ - ''రవన్న(ఆనంద్‌ రవి), నాది పుట్టినరోజు ఓకటే. అన్నతో 12 సంవత్సరాలుగా పరిచయం ఉంది. కష్టనష్టాల్లో నాకు తోడుగా నిలిచారు. ప్రతినిధి, ఈ సినిమా కూడా నేనే చేయాల్సింది కానీ కుదరలేదు. నెక్స్‌ట్‌ మూవీ అయినా చేయాలనుకుంటున్నాను. రవన్న సినిమా కథలన్నీ బావుంటాయి. ఈ నెపోలియన్‌ సినిమా వాటన్నింటి కంటే మరో ఎత్తులో ఉంటుందని భావిస్తున్నాను. నిర్మాతగారికి థాంక్స్‌'' అన్నారు.

నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి మాట్లాడుతూ - ''నేను ట్రేడ్‌ రంగంలో ఉండేవాడిని. ఒక టీంతో కలిసి పనిచేయడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. ఆనంద్‌ రవి లేకుంటే ఈ సినిమా లేదు. రవికి, టీమ్‌కి థాంక్స్‌'' అన్నారు.

ఆనంద్‌ రవి మాట్లాడుతూ - ''నేను ఈ కథతో చాలా మందిని కలిశాను. 'నీడపోయింది' అనే పాయింట్‌ చెప్పగానే ఇది షార్ట్‌ ఫిలిమా అని అడిగారు. తర్వాత నేనే హీరో అనగానే నువ్వే హీరోనా అని చాలా మంది అన్నారు. ప్రొడ్యూసర్‌ ఎవరని చాలా మంది అడిగారు. ఇలా అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. థ్రిల్లర్‌ జోనర్‌ మూవీయే అయినా, కొత్త కాన్సెప్ట్‌తో సాగుతుంది. ఇంత వరకు ప్రేక్షకులు నా సినిమాల నుండి ఏం కోరుకుంటున్నారనే అనుభవాన్నంతా కూడా ఈ సినిమాలో రాసుకున్నాను. అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా'' అన్నారు.

నిర్మాత బిఎ.రాజు మాట్లాడుతూ - ''నెపోలియన్‌ ముందు నుండే మంచి హైప్‌ క్రియేట్‌ చేసుకుంది. ట్రైలర్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. డెఫనెట్‌గా సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది'' అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ మార్గల్‌ డేవిడ్‌ మాట్లాడుతూ - ''కెమెరామెన్‌గా నా తొలి చిత్రం 'నెపోలియన్‌'. అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆనంద్‌రవి, నిర్మాత భోగేంద్ర గుప్తాగారికి థాంక్స్‌'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ సదాశివుని మాట్లాడుతూ - ''నేను మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన తొలి సినిమా ఇది. నీడ ఎక్కడికి పోయిందనేదే కొత్త కాన్సెప్ట్‌. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది'' అన్నారు.

కోమలి మాట్లాడుతూ - ''సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. 110 శాతం సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఎంగేజ్‌ చేస్తుంది'' అన్నారు.

లక్ష్మీ భూపాల్‌ మాట్లాడుతూ - ''రెగ్యులర్‌ సినిమాలు చూసే ప్రేక్షకులకు కొత్తదనం ఇచ్చే సినిమా అనడంలో ఏ సందేహం లేదు. నీడ కనపడకపోవడం అనేదే కొత్త కాన్సెప్ట్‌. అంతే కాకుండా దర్శకుడు ఆనంద్‌ రవి ప్రతినిధి సినిమాలో సోషల్‌ అవెర్‌నెస్‌ పాయింట్‌ను ఎలా టచ్‌ చేశాడో ఈ సినిమాలో కూడా అలాంటి ఎలిమెంట్స్‌ ఉంటాయనడంలో సందేహం లేదు. నిర్మాత నాకు మంచి మిత్రుడు. చాలా మంచివాడు. తను సినిమా చేస్తాననడంతో ముందు భయపడ్డాను కానీ తను అనుకున్న ప్లానింగ్‌లో అనుకున్న బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేశాడు'' అన్నారు.

ఆనంద్‌ రవి, కోమలి, రవివర్మ, కేదార్‌ శంకర్‌, మధుమణి, అల్లు రమేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, మ్యూజిక్‌: సిద్ధార్థ్‌ సదాశివుని, సినిమాటోగ్రఫీ: మార్గల్‌ డేవిడ్‌, పాటలు: బాలాజీ, ఆర్ట్‌: బాబ్జి, నిర్మాత: భోగేంద్ర గుప్తా మడుపల్లి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్‌ రవి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.