సుకుమార్‌తో నిహారిక
Send us your feedback to audioarticles@vaarta.com
`ఒక మనసు, హ్యపీ వెడ్డింగ్, ఒరు నెల్లా నాల్ పాత్తు సొల్రెన్` ఇప్పుడు `సూర్యకాంతం` వంటి సినిమాలతో నిహారిక కొణిదెల సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. మరో పక్క వెబ్ సిరీస్‌లో కూడా బిజీగా ఉంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం నిహారిక సుకుమార్ ప్రొడక్షన్ హౌస్ సుకుమార్ రైటింగ్స్‌లో ఓ సినిమా చేయబోతుందట.
మరి ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తాడా? లేక ఆయన శిష్యులు డైరెక్ట్ చేస్తారా? అనేది తెలియడం లేదు. డైరెక్టర్‌గా స్టార్ హీరోల సినిమాలను చేస్తున్న సుకుమార్ నిర్మాతగా కూడా తన శిష్యులను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే నిహారికతో సుక్కు సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే వివరాలు తెలుస్తాయంటున్నారు. కాగా ప్రస్తుతం `సూర్యకాంతం` సినిమాతో బిజీగా ఉంది నిహారిక.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.