చరణ్ తో పొలిటికల్ మూవీ ఓ యంగ్ డైరెక్టర్ డ్రీమ్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ పొలిటికల్ మూవీ చేయాలనేది ఓ యంగ్ డైరెక్టర్ డ్రీమ్. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య, రన్ చిత్రాల దర్శకుడు అని కన్నెగంటి. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా డైరెక్టర్ అని తెలియచేసాడు. మిస్టర్ నూకయ్య తర్వాత పొలిటికల్ స్టోరీ రెడీ చేసి రామ్ చరణ్ కి వినిపించాడట. కథ రామ్ చరణ్ కి బాగా నచ్చేసిందట.
ఇక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనుకునే టైమ్ కి స్టేట్ లో పొలిటిక్స్ మారిపోయాయట. అందుచేత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదీ కాకుండా ఎన్నికల సమయంలో ఈ చిత్రం చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా రామ్ చరణ్ తో ఈ సినిమా తీస్తాను. వచ్చే ఎన్నికల సమయంలోనైనా ఈ సినిమా తీస్తాను..ఇందులో భారతీయుడు తరహా మంచి సందేశం కూడా ఉంటుందని అంటున్నాడు ఈ యువ దర్శకుడు అని. మరి..అని ఆశ నెరవేరుతుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.