close
Choose your channels

అజయ్‌కు రవితేజ ‘నో’ చెప్పడానికి కారణమిదేనట

Monday, September 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అజయ్‌కు రవితేజ ‘నో’ చెప్పడానికి కారణమిదేనట

‘ఆర్ ఎక్స్100’ సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి పేరు ఈ మధ్య అస్తమాను వార్తల్లో వినపడుతోంది. వాస్తవానికి తన తదుపరి చిత్రానికి మంచి మాస్ కథ రాసుకున్న అజయ్.. మాస్‌ మహాజరాజ రవితేజను సంప్రదించారు. అంతేకాదు ఆ సినిమాకు ‘మహా సముద్రం’ అనే టైటిల్‌ను కూడా దాదాపు ఖరారు చేసేశారు. కథ మొత్తం విన్న తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ అజయ్ ట్విట్టర్ వేదిగా కాసింత అతి చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది..? ఎవరు ఎవరికి షాకిచ్చారు..? రవితేజ ఈ సినిమాకు ఎందుకు కాదనుకున్నారు..? ఇలా ప్రశ్నలకు ఇంతవరకూ సమాధానం దొరకలేదు.

అయితే తాజాగా.. ఓ ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. అజయ్ చెప్పిన కథ మొత్తం విన్న రవితేజ ఫస్టాఫ్‌కు ఫస్ట్ మార్కులేశాడట. అయితే సెకాండాఫ్ మాత్రం బాగోలేదని మార్పులు చేర్పులు చేయాలని డైరెక్టర్‌ను హీరో కోరాడట. ఈ మార్పులు చేయడానికి అజయ్ అస్సలు ఒప్పుకోకుండా ససేమీరా అన్నాడట. దీంతో ఈ సినిమా తాను చేయనని రవితేజ.. మీతో సినిమా తీయాలని తనకూ లేదని అజయ్ ఇద్దరూ మొఖానే అనుకున్నారట. దీంతో ఇద్దరూ సైడైపోయి.. ఆవేశంతో అజయ్ ట్విట్టర్ వేదికగా అలా విమర్శలు గుప్పించాడని ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతో..? అబద్ధమెంతో తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒక్కరు స్పందించాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.