close
Choose your channels

'క‌ర్త‌వ్యం' మా బ్యాన‌ర్ వాల్యూ ని రెట్టింపు చేసింది - శ‌ర‌త్ మరార్‌

Wednesday, March 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌ర్త‌వ్యం మా బ్యాన‌ర్ వాల్యూ ని రెట్టింపు చేసింది - శ‌ర‌త్ మరార్‌

ఎన్ని క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేసి, ఎన్ని కోట్ల రూపాయిలు సంపాయించినా ఓ మంచి చిత్రానికి వ‌చ్చే ప్ర‌శంసలు గుండె ని త‌డిచేస్తాయనేది అక్ష‌ర స‌త్యం. అప్పుడు మ‌న‌సు ఎంత హాయిగా వుంటుందో మాట‌ల్లో వ‌ర్ణించ‌లేము.

ఇప్ప‌డు క‌ర్త‌వ్యం లాంటి అద్బుత‌మైన చిత్రాన్ని తెలుగు కి తీసుకువ‌చ్చిన ప్ర‌ముఖ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ఫీలింగ్ అంత‌కుమించే వుంద‌ని చెప్పాలి. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారితో గోపాలా గోపాల, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ రాయుడు లాంటి క‌మ‌ర్షియ‌ల్ సూప‌ర్‌హిట్స్ సాధించారు.

ఆ త‌రువాత  సందేశాత్మ‌క చిత్రం గా తమిళ ప్రేక్ష‌కుల్ని ఊర్రూత‌లూగించిన విజ‌య్ న‌టించిన మెర్సల్ చిత్రాన్ని తెలుగులో అదిరింది అనే టైటిల్ తో విడుద‌ల చేశారు. ఈ చిత్రం అటు క‌మ‌ర్షియ‌ల్ గా, ఇటు క్రిటిక్స్ పరంగా ప్ర‌శంసలు వ‌చ్చాయి. అలాగే బోరు భావిలో చిన్న పిల్లలు ఆడుకుంటూ ప‌డిపోతే అక్క‌డ వాళ్ళ‌ని సేవ్ చేయాటానికి ఎటువంటి ఎక్విప్‌మెంట్ లేక ఇబ్బందులు ప‌డుతారో.. ఎక్కువ శాతం పిల్ల‌ల ప్రాణాలు కొల్పోతున్న పరిస్థితుల్ని న్యూస్ ఛానెల్స్ లో మనం చూస్తుంటాం.

అలాంటి సంఘటనల్ని క‌ళ్ళ‌కి క‌ట్టిన‌ట్టుగా తెర‌కెక్కించిన చిత్రం క‌ర్త‌వ్యం. ఈ చిత్రాన్ని ఈ నెల 16న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్‌.  ఈ సినిమా చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు చిత్రాన్ని, ద‌ర్శ‌కుడ్ని, క‌థానాయిక న‌య‌న‌తార ని ఏ రేంజి లో ప్ర‌శంసిస్తున్నారు.

ఇలాంటి ఓ అద్భుత‌మైన చిత్రాన్ని ఎంతో ధైర్యంతో తెలుగు కి తీసుకువ‌చ్చిన నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ కు అభింద‌న‌ల ప్ర‌శంసలు అందిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ లో వ‌రుస‌గా అదిరింది, క‌ర్త‌వ్యం లాంటి సామాజిక థృక్ప‌దం క‌లిగివున్న చిత్రాలు రావ‌టంతో తెలుగు ప్రేక్ష‌కుడికి ఈ బ్యాన‌ర్ పై రెట్టింపు గౌరవం పెరిగింది. ప్ర‌స్తుతం క‌ర్త‌వ్యం మంచి క‌లెక్ష‌న్ల తో ధియేట‌ర్స్ లో ప్రదర్షింపబడుతోంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత శ‌ర‌త్ మరార్ మాట్లాడుతూ..  మా నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారితో చాలా మంచి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేశాము. ఆ త‌రువాత మేము చేసిన అదిరింది చిత్రం మెడిక‌ల్ మాఫియా గురించి ప్ర‌జ‌లంద‌రికి తెలియ‌జెప్పిన చిత్రం గా ప్ర‌శంసలు అందుకున్నాం. ఆ త‌రువాత వ‌చ్చిన క‌ర్త‌వ్యం చూసిన ప్ర‌తి ఒక్క‌రి గుండె త‌డుస్తుంద‌ని.. అటు సోష‌ల్ మీడియాలో , ఇటు మీడియా లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇలాంటి మంచి చిత్రాన్ని నేను మెద‌టి సారి చూసిన‌ప్పుడు నా మ‌న‌సు చ‌లించిపోయింది. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ , న‌య‌న‌తార మ‌రియు ఇత‌ర న‌టీన‌టుల న‌ట‌న న‌న్ను క‌ట్టిపాడేశాయి. జిబ్రాన్ మ్యూజిక్ న‌న్ను భావోద్వేగంలో  ముంచేసింది. ఈ సినిమా అయిపోయాక ఆల్‌మెస్ట్ ఒక్క రోజంతా న‌న్ను వెంటాడింది.

అస‌లు గ్రామాల్లో ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే ఇంత అవ‌స్థ ప‌డాలా.. అనే ప్ర‌శ్న నాలో నేను వేసుకున్నాను. అన్ని చిత్రాలు డ‌బ్బుల కోసం కాదు మ‌నుషుల కొసం కొన్ని చిత్రాలు వుంటాయి అని గ‌ట్టిగా న‌మ్మి ఈ చిత్రాన్ని మా బ్యాన‌ర్ నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పేరుమీద తెలుగు ప్రేక్ష‌కుల‌కి చూపించాల‌ని అనుకున్నాను.

ఈ ప్ర‌య‌త్నానికి ప్రత్యేకంగా మీడియా ఫ్రెండ్స్ బాగా స‌పోర్ట్ చేశారు. అంతే కాదు ఇలాంటి ఒ సందేశాత్మ‌క చిత్రాన్ని తెలుగుకి తీసుకువ‌చ్చినందుకు నాకు ధ‌న్య‌వాదాలు చెబుతుంటే నా కంట ఆనంద‌భాష్పాలు వ‌చ్చా యి. ఈ క‌ర్త‌వ్యం అనే చిత్రం నా బ్యాన‌ర్ వాల్యూ ని రెట్టింపు చేసింద‌ని, ఇలాంటి మంచి చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుడి కి చూపించ‌టానికి ఎప్పుడు నేను, నా బ్యాన‌ర్ నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సిద్దంగా వుంటుంద‌ని త‌న ఆనందాన్ని తెలిపారు..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.