close
Choose your channels

ప్ర‌భాస్‌కి సాహో అన‌బోతున్న సురేంద‌ర్‌

Monday, November 4, 2019 • తెలుగు Comments

ప్ర‌భాస్‌కి సాహో అన‌బోతున్న సురేంద‌ర్‌

బాహుబ‌లి చిత్రంతో నేష‌న‌ల్ హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌దుప‌రి `సాహో` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా రూ.430 కోట్ల‌కు పైగా గ్రాస్ వసూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాది కంటే ఉత్త‌రాదినే సాహో పెద్ద విజ‌యాన్ని సాధించింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `జాన్‌` అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని సినీ వ‌ర్గాల స‌మాచాచారం.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ప్ర‌భాస్‌ను డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కలిశాడ‌ట‌. రీసెంట్‌గా సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సైరా న‌ర‌సింహారెడ్డి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే.

సైరా త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి ఎలాంటి సినిమా చేస్తాడ‌నే ఆస‌క్తితో పాటు ఎవ‌రితో చేస్తాడ‌నే ఆస‌క్తి కూడా నెల‌కొంది. ఇలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌హ‌కారంతో ప్ర‌భాస్‌ను సురేంద‌ర్ రెడ్డి క‌లిసి క‌థ‌ను వినిపించాడ‌ట‌. ప్ర‌భాస్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయ‌మ‌ని చెప్పిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అంతా ఓకే అయితే దిల్‌రాజు నిర్మాణంలో ప్ర‌భాస్‌, సురేంద‌ర్ రెడ్డి సినిమా తెర‌కెక్కుతుంది.

Get Breaking News Alerts From IndiaGlitz