close
Choose your channels

జ‌న‌వ‌రి 26న 'ఎన్‌.జి.కె'

Thursday, November 15, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌న‌వ‌రి 26న ఎన్‌.జి.కె

హీరో సూర్య ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎన్‌.జి.కె`(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతుంది.

ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది. మ‌రోవైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. నిజానికి ఈ సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ డైరెక్ట‌ర్ సెల్వ‌రాఘ‌వ‌న్‌కి అనారోగ్యం కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది. తాజాగా కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.