close
Choose your channels

దీపావ‌ళికి వ‌స్తున్న సూర్య సింగం-3 టీజ‌ర్..!

Thursday, October 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సీక్వెల్ సింగం-3 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తమిళ్ లో ప్రముఖ నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా మ‌ల్కాపురం శివ‌కుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ఈ చిత్రానికి తమిళం తో పాటు తెలుగు లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తప్పకుండా ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుంటుందని నమ్మకం వుంది. సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ నాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైన షెడ్యూల్ ఈ నెల 20 తో పూర్తయ్యింది. దీంతో టాకీ పార్ట్ పూర్తయ్యింది. బ్యాలన్స్ గా వున్న ఒక పాటను సూర్య, అనుష్క ల పై విదేశాల్లో త్వరలో చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తి అవుతుంది. దీపావళి కి టీజర్ ను, నవంబర్ లో ఆడియో ని విడుదల చేసి డిసెంబర్ 16 న తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.

తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయి. వైజాగ్ లో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. ఇప్పటికే తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లతో బిజినెస్ పూర్తయింది అని అన్నారు. అనుష్క శెట్టి, శృతీహాసన్, రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హేరీస్‌జైరాజ్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.