close
Choose your channels

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై స్పందించిన జగన్.. మోదీకి లేఖ

Saturday, February 6, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై స్పందించిన జగన్.. మోదీకి లేఖ

ఏపీని కుదుపేస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై ఎట్టకేలకు సీఎం జగన్ స్పందించారు. ఈ విషయమై ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు. విశాఖ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరారు. అలాగే స్టీల్ ప్లాంటు బలోపేతానికి అవసరమైన మార్గాలను అన్వేషించాలని జగన్ కోరారు. విశాఖ ఉక్కు ద్వారా ఎందరో ఉపాధి పొందుతున్నారని ఆయన పేర్కన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 20 వేల మంది, పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రజల పోరాట ఫలితంగా స్టీల్ ఫ్యాక్టరీ ఏపీకి లభించిందని జగన్ లేఖలో వెల్లడించారు.

దశాబ్ద కాలం పాటు ప్రజలు పోరాటం చేశారని.. నాటి ఉద్యమంలో 2 మంది ప్రాణాలు కోల్పోయారని లేఖలో జగన్ వెల్లడించారు. 2002–2015 మధ్య వైజాగ్‌స్టీల్‌ మంచి పనితీరు కనపరిచిందన్నారు. ప్లాంటు పరిధిలో 19700 ఎకరాల విలువైన భూములున్నాయని.. వాటి విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని జగన్ వెల్లడించారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంటుకు సొంతంగా గనులు లేవని.. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలవడం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చని జగన్ సూచించారు.

ఉత్పత్తి విషయంలో 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ.. 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నారని జగన్ వెల్లడించారు. డిసెంబర్‌ 2020లో రూ.200 కోట్ల లాభం కూడా వచ్చిందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే... ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. బైలదిల్లా గనుల నుంచి మార్కెట్‌ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోందని జగన్ తెలిపారు. దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోందన్నారు. దీనివల్ల వైజాగ్‌స్టీల్స్‌కు టన్నుకు అదనంగా రూ.3,472లు చొప్పున భారం పడుతోందని జగన్ పేర్కొన్నారు. సెయిల్‌కు సొంతంగా గనులు ఉన్నాయన్నారు. దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌కు ఉన్నాయని లేఖలో జగన్ స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.