close
Choose your channels

2019 నేషనల్ రౌండప్.. లాస్ట్‌ పంచ్‌ కాంగ్రెస్‌దే!!

Wednesday, January 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2019 నేషనల్ రౌండప్.. లాస్ట్‌ పంచ్‌ కాంగ్రెస్‌దే!!

2019కు గుడ్ బై చెప్పేసి మరికొన్ని గంటల్లోనే కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే అసలు 2019లో జాతీయ స్థాయిలో ఏమేం జరిగాయ్..? కేంద్రంలో కాలం ఎవరికి కలిసొచ్చింది..? ఎవరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది..? రెండోసారి ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణం చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి..? మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక చేసిన సంస్కరణలు, వివాదాస్పద నిర్ణయాలేంటి..? అనే విషయాలతో పలు ఆసక్తికరమైన విషయాలను సూటిగా సుత్తి లేకుండా మూడు ముక్కల్లో అందిస్తోంది.. మీ మా www.indiaglitz.com. ఇక ఆలస్యమెందుకు చదివేయండి మరి.

మోదీకి సగం గుడ్.. సగం బ్యాడ్ డేస్!

  • 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించనంతగా.. ఎవరి సపోర్టు లేకుండా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
  • కేబినెట్ కూర్పులో భాగంగా ఇంతవరకూ బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాకు.. కేంద్ర హోం మంత్రి బాధ్యతలు అప్పగించడం.
  • పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది కానీ.. అసెంబ్లీ ఎన్నికలు మాత్రం అచ్చిరాలేదు. ఒక్కొక్కటిగా రాష్ట్రం కమలనాథుల చేతుల్లో నుంచి వీడుతోంది.
  • కాంగ్రెస్‌కు 2019 మొదట్లో కలిసిరాకపోయినా.. చివర్లో మాత్రం కాస్త సంతృప్తిగానే అనిపించే రోజులొచ్చాయ్.
  • ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణం తానేనని యువరాజు రాహుల్ అధ్యక్షుడిగా ఉండనని హడావుడి.. మళ్లీ సోనియాగాంధీ పగ్గాలు చేపట్టడం
  • మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడంతో మంచి రోజులొచ్చాయి.. హస్తానికి రెక్కలొచ్చాయ్.. ఎగిరెగిరి ఎక్కడ ఆగుతుందో చూడాలి

షా స్పష్టమైన ముద్ర!

  • మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ అమిత్ షా ముద్రే!
  • అధికరణ 379 రద్దు ఇందుకొక తిరుగులేని ఉదాహరణ.
  • దేశ పాలనా వ్యవహారాలలో ఈ సంచలనాత్మక పరిణామాల ఫలితంగా అమిత్ షా ఇప్పుడు ప్రధానమంత్రి తరువాత అత్యంత ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు

ఉల్లి లొల్కే..!?

  • 2019 ఏడాదిలో ఎక్కువగా ఏడిపించింది ఉల్లే.. కోస్తుంటే ఏడవడం కాదండోయ్.. కొంటుంటే ఏడవాల్సి వచ్చింది.
  • సెప్టెంబర్ వరకు కొత్త పంట రాకపోవడంతో ఉల్లి ధరలు కొండెక్కాయి. రూ. 50, రూ. 100, రూ. 150, రూ. 200 ఇలా పేరుగుతూనే పోయాయి.
  • ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో కోట్లాదిమంది చేత ఉల్లి.. కన్నీళ్లు పెట్టించింది.  2019లో అత్యధిక మంది చేత కన్నీళ్లు పెట్టించిన అవార్డును ఉల్లికే సొంతం

పౌరసత్వం బిల్లు.. ఆగని ఆందోళనలు

  • పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం ఇచ్చే వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు భారత పార్లమెంట్ ఆమోదం
  • 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకుంది.
  • ఈ బిల్లుతో ప్రజాదరణ పెరుగుతుంటే అదే సమయంలో అంతర్జాతీయంగా విమర్శలపాలవ్వడం.. ‘మైనారిటీలను చిన్నచూపు చూస్తోంది’ అనే విమర్శ కీలకమైంది.
  • భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది ముస్లింలుండటం.. ఈ నిర్ణయంతో ముస్లింల ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు.

రైతులకు శుభవార్త

  • ‘కిసాన్ సమ్మాన్ యోజన’ పథకానికి సంబంధించి మంత్రిమండలి కీలక నిర్ణయం.. ఈ పథకం ద్వారా దేశంలోని రైతులందరికీ పెట్టుబడి సాయం.. దీంతో పాటు పింఛన్ పథకం, వ్యాపారులకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు

సుప్రీంకోర్టు సంచలన తీర్పులు

  • రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు
  • శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం
  • మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష
  • ఆర్టికల్ 370 రద్దు
  • రఫేల్ ఒప్పందం
  • భారత ప్రధాన న్యాయమూర్తిని ఆర్టీఐ కిందకు తీసుకురావడం
  • తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనుమతించడం
  • లక్షల మందికి ఉచిత న్యాయ సహాయం
  • సహజీవనంలో సెక్స్ రేప్ కాదు..  ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

మొత్తానికి చూస్తే.. 2019 మొదట్లో బీజేపీకి కలిసొచ్చినా.. చివర్లో మాత్రం అదేదో డైలాగ్ ఉంది కదా.. ‘లాస్ట్‌ పంచ్‌ మనదైతే.. ఆ కిక్కే వేరబ్బా’ అన్నట్లు కాంగ్రెస్ గట్టిగానే బీజేపీని దెబ్బతీసిందని.. మున్ముంథు ఇంకా గట్టిగానే ఢీ కొడుతుందని చెప్పుకోవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.