close
Choose your channels

జగన్ ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో బాలయ్య!

Thursday, December 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జగన్ ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో బాలయ్య!

అవును.. అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటనతో నారా ఫ్యామిలీ.. నందమూరి ఫ్యామిలీ సభ్యుల మధ్య చిచ్చుపెట్టింది. అదేంటి ఏమైంది అని అనుకుంటున్నారా..? ఆ విషయం తెలుసుకోవాలంటే www.indiaglitz.com అందిస్తున్న ప్రత్యేక కథనం చకచకా చదవాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన పెను సంచలనమైంది. ఈ ప్రకటనే నారా వర్సెస్ నందమూరిగా మారింది!.

జగన్ ప్రకటనకు స్వాగతం!

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్యనేతలు సాదరంగా స్వాగతించిన విషయం తెలిసిందే. కాగా.. విశాఖలో బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్‌కు సంబంధించిన గీతం యూనివర్శిటీ ఉండటం.. పెద్ద ఎత్తున భూములు ఉండటంతో ఆయన కూడా దాదాపు స్వాగతించి జై కొట్టినట్లేశారు. ఈ క్రమంలో విశాఖ టీడీపీ నేతలు, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ భరత్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. చంద్రబాబు, నారా లోకేష్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం.. రాజధాని రైతులు ఆందోళనలు చేపడుతుండటం.. వారికి టీడీపీ నేతలు మద్దతివ్వడంతో.. చర్చనీయాంశమైంది.

ఎవరికి సపోర్ట్ చేయాలో!

జగన్ ప్రకటనను అటు చిన్నల్లుడు శ్రీ భరత్ స్వాగతించడం.. ఇటు మామ చంద్రబాబు, నారా లోకేష్ వ్యతిరేకిస్తుండటంతో ఏం చేయాలో బాలయ్యకు దిక్కుతోచట్లేదు. అందుకే జగన్ ప్రకటనపై బాలయ్య ఇంతవరకూ రియాక్ట్ అవ్వలేదని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా బాలయ్య పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో బాలయ్య ఏం మాట్లాడాలో..? అటు చిన్నల్లుడికి సపోర్ట్ చేయాలో..? లేదా మామయ్యకు సపోర్ట్ చేయాలో తెలియట్లేదట. ఈ పరిస్థితులు కాస్త తీవ్రమైతే మాత్రం నారా వర్సెస్ నందమూరిగా పరిస్థితులు మారతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఇదే జరిగితే పరిస్థితులు ఎలా మారతాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలకృష్ణ ఇంట్లో రాజకీయంగా చిచ్చుపెట్టినట్టే కనిపిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.