close
Choose your channels

మాజీ ఎమ్మెల్యే బుజ్జి పాడె మోసిన చంద్రబాబు...

Thursday, December 26, 2019 • తెలుగు Comments

తెలుగుదేశం కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. గురువారం అర్ధరాత్రి రెండు గంటలకు బుజ్జికి గుండెపోటు వచ్చింది. ఆయన బాగా ఇబ్బంది పడుతుండటంతో అత్యవసర చికిత్సకై ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆయన మృతి చెందాడని తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బుజ్జి కుటుంబ సభ్యులకు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు పరామర్శించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి.. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం ఏలూరుకు వెళ్లిన చంద్రబాబు.. బుజ్జి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు మాగంటి బాబు, లోకేష్.. నివాళులు అర్పించారు. అనంతరం బుజ్జి అంతిమయాత్రలో పాల్గొన్న బాబు.. పాడె మోశారు. బాబుతో పాటు.. ఎమ్మెల్యే రామా నాయుడితో పాటు పలువురు టీడీపీ నేతలు బుజ్జి పాడె మోశారు. ఈ అంతిమ సంస్కారాల్లో పెద్ద ఎత్తున బుజ్జి వీరాభిమానులు, అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz