close
Choose your channels

ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ‘హలో సుజనా’, చంద్రబాబు!

Friday, June 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ‘హలో సుజనా’, చంద్రబాబు!

హలో సుజనా తిన్నావా రా.. ఏమైంది..? అలా ఎలా వదిలేస్తావ్ నన్ను.. ఏం ఏం నాటకాలా..? తమాషాలుగా ఉందా..? ఈ డైలాగ్స్‌ గత ఏడాదిగా ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా టిక్ టాక్ ఓపెన్ చేస్తే ఇదే డైలాగ్స్.. చిత్ర విచిత్రాలుగా డ్యాన్స్‌లు. అయితే ఇప్పుడిప్పుడే సుజనాను మరిచిపోయి జనాలంతా ట్రాక్ మారుస్తుండగా మరోసారి ఇది ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సారి ఆ సుజనా వల్ల కాదండోయ్.. ఇంకెవరబ్బా అని ఆలోచిస్తున్నారు.. అదేనండి మొన్నటి వరకు టీడీపీలో ఉండి నిన్నే తనతో పాటు మరో ముగ్గురు ఎంపీలను బీజేపీలోకి తీసుకెళ్లారే ఆయనే ఎంపీ సుజనా చౌదరి.

సుజనా ఏమైంది.. టీడీపీని వదిలేస్తున్నావా..!?

అసలు విషయానికొస్తే.. ఆ సుజనా చౌదరిని.. చంద్రబాబును ఇద్దరూ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నారు. టీడీపీ ఎంపీలు ఫిరాయింపుకు ముందు చంద్రబాబు వాళ్లతో సుధీర్ఘంగా మంతనాలు జరిపారని ఎంత బుజ్జగించినప్పటికీ ‘ఆ నలుగురు’ వినలేదని తెలుస్తోంది. అయితే దీన్ని కామెడిగా మలుచుకున్న కొన్ని టీడీపీ వ్యతిరేక ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీల అడ్మిన్లు ‘హలో సుజనా ఏమైంది రా.. టీడీపీని వదలేస్తున్నావా.. ’ అని ఫొటో షాప్‌లో చంద్రబాబు ఫోన్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను.. సుజనా ఫొటోను మిక్స్‌చేసి తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం అటు వైసీపీ నేతలు.. ఇటు నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ వ్యవహారంపై ట్రోలింగ్స్ చేస్తున్నారు.

ఆ బాధేంటో బాబు తెలుస్తోందా!

సో.. మొత్తానికి చూస్తే నాడు సుజనా.. నేడు సుజనా చౌదరి, చంద్రబాబు నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని కొందరు సిల్లీగా తీసుకున్నా.. నిజమే కదా.. నాడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఆ పార్టీ అధినేత.. పార్టీ పెద్దలు ఎంత బాధపడ్డారో.. ఆ బాధ ఏంటో ఇప్పుడు చంద్రబాబుకు తెలుస్తోందని ట్రోలింగ్స్ చేస్తున్నారు. కాగా.. గురువారం నాడు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులు టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.