close
Choose your channels

Deepti Sunaina : కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన దీప్తి సునైన .. ఫ్యామిలీతో చిల్ , ఫోటోలు వైరల్

Saturday, December 10, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Deepti Sunaina : కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన దీప్తి సునైన .. ఫ్యామిలీతో చిల్ , ఫోటోలు వైరల్

టిక్‌టాక్, డబ్ స్మాష్, యూట్యూబ్ స్టార్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది దీప్తి సునైన. సోషల్ మీడియాలో తనకున్న బేస్‌తోనే అవకాశాలు సృష్టించుకుంటోంది ఈ హైదరాబాద్ అమ్మాయి. నగరంలోని స్టెవెన్స్ అన్నాస్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన దీప్తి.. ఆ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్‌కి ఎంట్రీ ఇచ్చారు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో దీప్తికి ఫ్యాన్ బేస్:

వైట్ స్కిన్ టోన్‌తోనే, మంచి ఫిగర్‌తో చూడగానే ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం. అందుకే చీరకట్టుతో పాటు లేటెస్ట్ ట్రెండీ వేర్‌తో హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ రచ్చ చేస్తూ వుంటోంది. అందాల ఆరబోతతో పాటు మంచి డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ నిత్యం యూత్‌తో టచ్‌లో వుంటోంది దీప్తి సునైన. అలా ఫేస్‌బుక్, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటోంది.

షణ్ముఖ్‌తో బ్రేకప్‌ తర్వాత దూకుడుగా :

ఈ క్రమంలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జత్వంత్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కుతారు అనుకుంటున్న సమయంలో ఇద్దరూ బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరి దారులు వారివయ్యాయి. ఇద్దరూ కెరీర్‌లో దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వీరిద్దరూ మళ్లీ కలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ దీప్తి, షణ్ముఖ్‌లు మాత్రం బెట్టు వీడటం లేదు.

ఇంటి వాళ్లవుతున్న వెండితెర, బుల్లితెర నటులు:

ఇదిలావుండగా వెండితెర, బుల్లితెర నటులు ఒక్కొక్కరిగా సొంతింటి కలను నెరవేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తీన్మార్ సావిత్రి, సీరియల్ నటి శ్రీవాణిలు గృహ ప్రవేశాలు చేశారు. తాజాగా దీప్తి సునైన కూడా ఈ జాబితాలోకి చేరారు. హైదరాబాద్‌ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసిన ఆమె.. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టి పాలు పొంగించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు దీప్తి సునైన. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ఆమె అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.