close
Choose your channels

'విరాటపర్వం' నుండి టబు తప్పుకుందా?

Friday, August 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`విరాటపర్వం` నుండి టబు తప్పుకుందా?

`విరాట ప‌ర్వం 1992` షూటింగ్ స్టార్టయ్యింది. రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. `నీది నాది ఒకే క‌థ` ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్ప‌టికే టబు, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తార‌ని వార్త‌లు విన‌పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి టబు తప్పుకుందని వార్తలు వినపడుతున్నాయి. చేతిలో ఉన్న సినిమాల కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆమె తప్పుకుందని వార్తలు వినపడుతున్నాయి. ఆమె స్థానంలో మరో నటి కోసం చిత్ర యూనిట్ అన్వేషణలో ఉందని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో సాయిపల్లవి పాల్గొంటుంది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.