close
Choose your channels

మ‌హేశ్ టైటిల్ అదేనా?

Monday, August 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హేశ్ టైటిల్ అదేనా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 25వ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌, పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో జ‌రుగుతుంది. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను మ‌హేశ్ పుట్టిన‌రోజున విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. అందులో కోస‌మ‌ని చేశారు. ఆర్‌, ఐ, ఎస్ అనే మూడు అక్ష‌రాల‌ను విడుద‌ల చేశారు.

అయితే ఈ మూడు అక్ష‌రాల‌ను బేస్ చేసుకుని మ‌హేశ్ టైటిల్ 'రిషి' అనే వార్త‌లు సోష‌ల్ మీడియా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి మ‌హేశ్ టైటిల్ ఏంటో తెలియాలంటే త‌న పుట్టిన‌రోజు వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.