close
Choose your channels

ర‌వితేజ చిత్రంలో న‌భా

Saturday, September 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌వితేజ చిత్రంలో న‌భా

తొలి తెలుగు చిత్రం `న‌న్నుదోచుకుందువ‌టే`తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న హీరోయిన్ న‌భా న‌టేశ్‌. మంచి న‌ట‌న‌తో ఆకట్టుకున్న న‌భా నటేశ్‌కు ఇప్పుడు తెలుగులో మ‌రో మంచి అవ‌కాశం వ‌చ్చింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో ర‌వితేజ డ‌బుల్ రోల్ చేస్తున్నాడ‌ట‌. కాబ‌ట్టి ఓ హీరోయిన్‌గా న‌భాన‌టేశ్‌ను సంప్ర‌దించార‌ట యూనిట్‌. ప్ర‌స్తుతం ర‌వితేజ `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా మొద‌లు కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.